Pushpa 3 : మైత్రీ మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. తాము నిర్మించిన పుష్ప మూవీ భారత దేశ సినీ చరిత్రలో రికార్డు క్రియేట్ చేసింది. వసూళ్లను సాధించడంలో దుమ్ము రేపింది. ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో తీసిన పుష్ప బిగ్ సక్సెస్ అయ్యింది.
Mythri Movie Makers Announce Pushpa 3
బన్నీ మేనరిజం, శ్రీవల్లి పాత్రలో రష్మిక చేసిన అభినయం ఆకట్టుకుంది. ఇక సమంత రుత్ ప్రభు చేసిన స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. భారీ వసూళ్లు సాధించడంతో పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప-2ను గత ఏడాది 2024 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు.
దీనికి కొనసాగింపుగా తీసిన పుష్ప-2 చిత్రం ఆశించిన దానికంటే అత్యధికంగా వసూలు చేసింది. ఏకంగా ఏ భారతీయ సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 2,200 కోట్లకు పైగా వసూలు చేయడం సినీ వర్గాలను ఆశ్చర్య పోయేలా చేసింది.
రష్మిక మందన్నా, బన్నీతో పాటు స్పెషల్ సాంగ్ లో నటించింది శ్రీలీల. ఈ మూవీలోని మేనరిజం, పాటలు, డైలాగులు కెవ్వు కేక అనిపించేలా చేశాయి. ఈ తరుణంలో ఉన్నట్టుండి కీలక అప్ డేట్ ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రామ్ . ఓ వైపు ఐటీ శాఖ దాడులు చేసినా డోంట్ కేర్ అంటూ పుష్ప -2 మూవీకి సంబంధించి సీక్వెల్ రానుందని ప్రకటించారు. త్వరలోనే పుష్ప-3 షూటింగ్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
దీంతో కథ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరు నటిస్తారనేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
Also Read : Beauty Janhvi-Pushpa 3 : స్పెషల్ సాంగ్ కు జాన్వీ బెటర్ ఛాయిస్