Hero Jr NTR Movie :తార‌క్ డ్రాగ‌న్ వ‌ర‌ల్డ్ ను షేక్ చేస్తుంది

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత ర‌వి శంక‌ర్

Jr NTR : మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత ర‌వి శంక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌దీప్ న‌ట‌రాజ‌న్, లోహ‌ర్ క‌లిసి న‌టించిన డ్రాగ‌న్ మూవీ కాసులు కొల్ల‌గొడుతోంది. ఇప్ప‌టికే రూ. 60 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ సంద‌ర్బంగా స‌క్సెస్ మీట్ నిర్వహించారు. డ్రాగ‌న్ జోన‌ర్ వేర‌ని, కానీ తాము జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr NTR) తో ప్ర‌శాంత్ నీల్ తీస్తున్న మూవీ దుమ్ము రేప‌డం ఖాయ‌మ‌న్నారు. అంతే కాదు ప్ర‌పంచాన్ని షేక్ చేస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Jr NTR Movie

ఆయ‌న చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఉంది. అయినా ఇప్ప‌టికే మార్కెట్ రేంజ్ ఆశించిన దానికంటే ఎక్కువ ప‌ల‌క‌డం విశేషం. త‌ను హిందీ మూవీ వార్ 2లో న‌టిస్తున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. అంత‌కు ముందు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన దేవ‌ర సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది.

ఇక పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్, స‌లార్ తో దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. ప్ర‌స్తుతం తార‌క్ నీల్ కాంబినేష‌న్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Also Read : దుమ్ము రేపిన ‘ది ప్యార‌డైజ్ రా స్టేట్‌మెంట్‌ ‘

Jr NTRMythri Movie MakersProducerUpdatesViral
Comments (0)
Add Comment