ఓటీటీలోకి ‘800’ సినిమా… డేట్ ఎప్పుడంటే ?
Muttiah Muralitharan: శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మధుర్ మిత్తల్, మహిమా నంబియార్, నరేన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) బయోపిక్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెట్టింది ఈ బయోపిక్ డిజిటల్ రైట్స్ సంపాదించిన జియో సినిమా. క్రికెట్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ‘800’ సినిమాను డిసెంబర్ 2న జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలతో పాటు సింహళ భాషలోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో సినిమా యాజమాన్యం స్పష్టం చేసింది.
Muttiah Muralitharan – ‘800’ సినిమా కథ ఏమిటంటే..
తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో జన్మించిన ముత్తయ్య మురళీధరన్… ఎన్నో కష్టాలను అనుభవించి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. స్పిన్ మాంత్రికుడిగా గుర్తింపు పొందిన ముత్తయ్య మురళీధరన్…. టెస్టులు, వన్డే క్రికెట్ లలో కల్పి 1000 వికెట్లకు పైగా సాధించి ఈ ఘనత పొందిన తొలి బౌలర్ గా అవతరించాడు. సింహళం మాట్లాడే వర్గం… తమిళం మాట్లాడే వర్గాల మధ్య 70వ దశకంలో చెలరేగిన ఘర్షణల్లో ముత్తయ్య కుటుంబం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎప్పుడు? ఎలా ఏర్పడింది? తను శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా రాటుదేలాడు? ఆయన 800 వికెట్ల ప్రయాణం సాగిన విధానం ఎలా సాగింది అనే ఇతి వృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఎంఎస్ శ్రీపతి.
Also Read : Pippa: బహిరంగ క్షమాపణ చెప్పిన పిప్పా సినిమా టీమ్