Aga Khan(88) Death : లోకాన్ని వీడిన దాన‌వుడు ‘ఆగా ఖాన్’

ప్ర‌పంచ వ్యాప్తంగా దాతృత్వానికి పేరు

Aga Khan : ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడు , మాన‌వ‌తా వాది ఆగా ఖాన్ 88 సంవత్సరాల వయసులో లోకాన్ని వీడారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగా ఖాన్(Aga Khan) డెవ‌లప్మెంట్ నెట్ వ‌ర్క్ ద్వారా ల‌క్ష‌లాది మందిని ఆదుకున్నారు. విద్యా సంస్థ‌ల‌ను, ఆస్ప్ర‌తుల‌ను నెల‌కొల్పారు. అభివృద్ది ప‌నుల‌కు ప్ర‌సిద్ది చెందారు. తాను చేసిన కృషికి గాను యావ‌త్ ప్ర‌పంచం విషాదానికి లోనైంది. ఎన్నో దేశాల అధినేత‌లు సంతాపం ప్ర‌క‌టించారు.

Aga Khan NO More..

ఆగా ఖాన్ చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా భార‌త దేశం అత్యున్న‌త‌మైన ప‌ద్మ విభూష‌ణ్ అవార్డుతో స‌త్క‌రించింది ఆగా ఖాన్ ను. భార‌త దేశంలో కూడా ఆగా కాన్ నెట్ వ‌ర్క్ సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి. కుల‌, మ‌తాల‌కు అతీతంగా విద్యా దానం చేసిన గొప్ప వ్య‌క్తి ఆయ‌న‌. ఆయ‌న లిస్బ‌న్ లో మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబీకులు వెల్ల‌డించారు.

ఆగా ఖాన్ చాలా కాలం పాటు ఫ్రాన్స్ లో జీవితం గ‌డించారు. ప్ర‌స్తుతం ఆయ‌న పోర్చుగ‌ల్ లో ఉన్నారు. ఆయ‌న స్థాపించిన ఆగా ఖాన్ నెట్ వ‌ర్క్, ఫౌండేష‌న్ స్విట్జ‌ర్లాండ్ లో ఉంది. ఆయ‌నకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు , అనేక మంది మ‌న‌మ‌రాళ్లు ఉన్నారు.

ఆగా ఖాన్ డిసెంబ‌ర్ 13, 1936లో జెనీవాలో పుట్టాడు. త‌న బాల్యాన్ని కెన్యా లోని నైరోబీలో గ‌డిపాడు. హార్వ‌ర్డ్ లో ఇస్లామిక్ చ‌రిత్ర‌ను చ‌దివాడు. త‌న తాత మ‌ర‌ణించ‌డంతో ఇస్మాయిలీ ముస్లింల‌కు ఇమామ్ అయ్యాడు 20 ఏళ్ల వ‌య‌సులో. మ‌ల్టీ మిలియ‌నీర్ గా ఉన్నారు. ప్రైవేట్ జెట్ లు, సూప‌ర్ యాచ్ లు, బ‌హామాస్ లో ప్రైవేట్ ద్వీపం ఉంది. బ్రిటీష్, ఫ్రెంచ్, స్విస్, పోర్చుగీస్ పౌర‌స‌త్వం క‌లిగి ఉన్నాడు. ఆగా ఖాన్ సంస్థ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, గృ హ నిర్మాణం, గ్రామీణ ఆర్థిక అభివృద్దిపై ఫోక‌స్ పెడుతుంది.

Also Read : Sekhar Kammula Shocking :అందాల ‘గోదావ‌రి’ అల‌రించేందుకు రెడీ

BreakingInternational NewsUpdatesViral
Comments (0)
Add Comment