Music Director Vijay Anand: వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆనంద్(Vijay Anand) (71) చైన్నెలో అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విజయ్ ఆనంద్… మంగళవారం రాత్రి తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విసు దర్శకత్వం వహించిన ‘నాణయం ఇల్లాద నాణయం’ సినిమా ద్వారా 1982లో విజయ్ ఆనంద్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘నాన్ అడిమై ఇల్లై’ చిత్రం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని ‘ఒరు జీవన్ దాన్ ఉన్ పాడల్‌దాన్..’ పాట చాలా పాపులర్ అయ్యింది. విజయ్ ఆనంద్ భౌతిక కాయానికి బుధవారం నాడు చైన్నెలో అంత్యక్రియలు నిర్వహించారు. విజయ్ ఆనంద్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత కళాకారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Music Director Vijay Anand No More
తమిళంలో ‘కొరుక్కు ఉపదేశం’, ‘రాసాతి వరుం నాళ్’ తదితర 10 చిత్రాలకు పని చేసిన విజయ్ ఆనంద్ కన్నడంలో 100కు పైగా సినిమాలకు సంగీతం అందించారు. తమిళంలో ఇళయరాజా మంచి ఫాం లో ఉన్నప్పుడు… కన్నడలో విజయ్ ఆనంద్ మంచి గుర్తింపు పొందారు. కన్నడ సినీ పరిశ్రమకు విజయ్ ఆనంద్ చేసిన సంగీత సేవ ఎనలేనిది.
Also Read : Janhvi Kapoor: అల్లు అరవింద్ ‘రామాయణం’ లో సీతగా జాన్వీ కపూర్ ?