Thaman : ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై కీలక ట్వీట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

అవును, అందరు భావిస్తునట్లే మూవీ టీమ్ సినిమా నుండి థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది...

Thaman : రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అద్వానీ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల రిలీజైన టీజర్ సూపర్ రెస్పాన్స్ సాధించగా, విడుదలైన రెండు పాటలు చాట్ బస్టర్ లుగా నిలిచాయి. ఈ తరుణంలోనే మరో మెస్మరైజింగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అవుతుంది.

Thaman Comments..

అవును, అందరు భావిస్తునట్లే మూవీ టీమ్ సినిమా నుండి థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) ఆసక్తికర ట్వీట్ షేర్ చేశారు. ఈ సాంగ్ ని నవంబర్ 22న అనౌన్స్ చేయనుండగా, ప్రోమోని 25న, సాంగ్ ని 27న రిలీజ్ చేయనున్నారట. ఇక ఇదొక మెలోడీ సాంగ్ అని తమన్(Thaman) కన్ఫామ్ చేశారు. రామ్ చరణ్ మూవీ నుండి ఒక మెలోడీ వచ్చి చాలా రోజులైంది. దీంతో శంకర్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఈ కాంబినేషన్‌లో మెలోడీ అంటే మెగా ఫ్యాన్స్ చెవులు కోసుకుంటున్నారు. ఇక లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేస్తూ.. ‘విని చాలా రోజులైంది. కానీ ఇంకా నా మ‌నసులో మారు మ్రోగుతూనే ఉంది. విన్న వెంట‌నే న‌చ్చేసే మోలోడీ’ అంటూ పోస్ట్ చేశారు. అలాగే తమన్ నుండి రాబోతున్న నెక్స్ట్ లెవల్ సాంగ్ గా చెప్పుకొచ్చారు. దీంతో చరణ్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Also Read : King Nagarjuna : నాగ చైతన్య, శోభితల పెళ్లి పై కింగ్ నాగార్జున కీలక వ్యాఖ్యలు

game changerss thamanTrendingUpdatesViral
Comments (0)
Add Comment