Game Changer : గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్

తాజాగా ఈ సినిమాను ట్రెండింగ్ చేసే బాధ్యత తమన్ తీసుకున్నారు...

Game Changer : ఎక్కడైనా సినిమా ప్రమోషన్ హీరో చేస్తాడు లేదంటే దర్శక నిర్మాతలు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం డిఫెరెంట్.. విచిత్రంగా మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ప్రమోషన్ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. అది కూడా ఏం చిన్న సినిమా కాదు.. పాన్ ఇండియన్ సినిమా. అంత బరువు ఒక్కడే మోస్తున్నాడు. ఆ సినిమా ఏంటో ఈ పాటికే అర్థమయ్యుంటుంది కదా.! అసలేమీ అప్‌డేట్స్ ఇవ్వకుండా.. ఇస్తున్నాం ఇస్తున్నామంటూ ఊరిస్తూ ట్రెండింగ్‌లో ఉన్న సినిమా గేమ్ ఛేంజర్(Game Changer) మాత్రమే అనుకుంటా..! ఎప్పుడడిగినా అదిగో పులి.. ఇదిగో మేక అన్నట్లుంటుంది మేకర్స్ ఇచ్చే సమాధానం.

Game Changer Movie Promotions

తాజాగా ఈ సినిమాను ట్రెండింగ్ చేసే బాధ్యత తమన్ తీసుకున్నారు. ఆయనే వరస ట్వీట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. పరిస్థితులు చూస్తుంటే.. గేమ్ చేంజర్ ప్రమోషనల్ బాధ్యత పూర్తిగా తమన్ తీసుకున్నారని అర్థమవుతుంది. ఆయనకు దిల్ రాజు టీం కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమన్ ఒక్కడే యాక్టివ్‌గా ఉన్నారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మరో వారంలో మొదలవుతాయని.. అక్టోబర్ 1 నుంచి RR మొదలవుతుందని తెలిపారు తమన్. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కూడా తమనే కన్ఫర్మ్ చేసారు. డిసెంబర్ 20న రానుందని ప్రకటించారీయన. నవంబర్ రెండో వారం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. నెల రోజులు ప్రమోషన్‌కే కేటాయించాలని చూస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ చివరి వారంలో మరో పాటను విడుదల చేయనున్నారు. అక్టోబర్ నుంచి ప్రమోషన్స్ జోరు మరింత పెరగనుంది.

Also Read : Prabhas – Spirit : డార్లింగ్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Cinemagame changerPromotionsTrendingUpdatesViral
Comments (0)
Add Comment