Murali Mohan Shocking :లీడ‌ర్ల కంటే సినిమా వాళ్ల‌కే ఆద‌ర‌ణ ఎక్కువ‌

ప్ర‌ముఖ న‌టుడు మురళీ మోహ‌న్ కామెంట్స్

Murali Mohan : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ న‌టుడు ముర‌ళీ మోహ‌న్(Murali Mohan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌తి ఏటా ఫిబ్ర‌వ‌రి 6న తెలుగు సినిమా పుట్టిన రోజుగా నిర్వ‌హించాల‌ని తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశానికి ప్ర‌ముఖ న‌టులు , ఇత‌ర సాంకేతిక నిపుణులు హాజ‌ర‌య్యారు.

Murali Mohan Shocking Comments

ముర‌ళీ మోహ‌న్ మాట్లాడుతూ రాజ‌కీయ నాయ‌కుల కంటే సినిమా వాళ్ల‌కే ప్ర‌జాద‌ర‌ణ ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. కానీ త‌మ‌కంటే ఎక్కువ అని వాళ్లు భావిస్తుంటార‌ని అది క‌రెక్ట్ కాదంటూ బాంబు పేల్చారు.

పొలిటిక‌ల్ లీడ‌ర్లకు ప‌ద‌విలో ఉన్నంత వ‌ర‌కే ఆద‌ర‌ణ ఉంటుంద‌ని , కానీ కానీ సినిమా వాళ్ల‌కు అలా ఉండ‌ద‌న్నారు. క్రీడాకారుల‌కు కూడా అంతంత మాత్ర‌మే రెస్పెక్ట్ ఉంటుంద‌న్నారు. బాగా ఆడితేనే లైమ్ లైట్ లో ఉంటార‌ని లేక పోతే ప‌ట్టించు కోరంటూ చెప్పారు ముర‌ళీ మోహ‌న్.

సినీ నటులు మాత్రం ఎప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారని అన్నారు. ఇవాళ తెలుగు సినిమా ద‌దినోత్స‌వాన్ని జ‌రుపు కోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు . మ‌ద‌రాసులో ఉన్న‌ప్పుడు తాము సినిమా కుల‌మ‌ని గ‌ర్వంగా చెప్పుకునే వాళ్ల‌మ‌న్నారు.

Also Read : Balagam Beauty Kavya: మెస్మ‌రైజ్ చేస్తున్న బ‌ల‌గం బ్యూటీ 

Commentsmurali mohanViral
Comments (0)
Add Comment