Multi Starer Movie : ఒక కొత్త స్టోరీ తో శౌర్య ,దుల్కర్, రష్మిక జోడీగా మల్టీస్టారర్ మూవీ

కథ వినగానే పైన చెప్పిన నటీనటులు ఎంతో ఆసక్తికాగా ఈ సినిమా చెయ్యాలన్న కుతూహలం కనబరిచారని తెలుస్తోంది...

Multi Starer : త్వరలోనే ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. ఇందులో మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, తెలుగు నటుడు నాగ శౌర్య లతో పాటుగా రష్మిక మందన్న కూడా ప్రధాన పాత్రలో ఒక మల్టి స్టారర్ సినిమా మొదలవబోతోంది అని, ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకుడిగా రవి అనే ఒక యువకుడు పరిచయం అవుతున్నట్టుగా సమాచారం. రవి ఇంతకు ముందు దర్శకుడు పరశురామ్ దగ్గర ఒక సినిమాకి పని చేసినట్టుగా తెలుస్తోంది. అతని ఒక కొత్త కథని రాసుకొని అది దుల్కర్ సల్మాన్ కి వినిపించినట్టుగా తెలుస్తోంది. దుల్కర్(Dulquer Salman) కి ఆ కథ నచ్చి వెంటనే ఆ సినిమా చేద్దామని చెప్పారని, ఆ తరువాత నాగ శౌర్య కూడా అందులో ఒక ప్రధాన పాత్రలో కనపడతారని, వీరికి తోడుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఇంకో ప్రధాన పాత్రలో కనిపించబోతోందని తెలిసింది.

Multi Starer Movie Update

కథ వినగానే పైన చెప్పిన నటీనటులు ఎంతో ఆసక్తికాగా ఈ సినిమా చెయ్యాలన్న కుతూహలం కనబరిచారని తెలుస్తోంది. వీరితో పాటుగా ఇందులో ఇంకొక కథానాయిక కూడా ఉంటుందని, అలాగే ప్రముఖ క్యారెక్టర్ నటులు రమ్య కృష్ణ, సత్య రాజ్, రావు రమేష్ లతో పాటు ఇంకా ప్రముఖ క్యారెక్టర్ నటులు ఇందులో ఉంటారని తెలుస్తోంది. ఈ సినిమా ఒక హై బడ్జెట్ సినిమాగా రూపు దిద్దుకుంటోందని, ఈ సినిమా కథకి చాలామంది నటులు అవసరం ఉందని కూడా తెలిసింది. దర్శకుడు రవి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడని, కొత్తవాడైన అతనికి కథపై చాలా క్లారిటీ ఉందని, అలాగే సినిమా ఎలా చెయ్యాలో కూడా ఇంకా క్లారిటీ ఉందని, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ప్రధానంగా ఒక ఆకర్షణ అని, అందుకే ఇదొక మల్టి స్టారర్ సినిమాగా తెరకెక్కించనున్నాడని అర్థం అవుతోంది.

Also Read : Sania Mirza : మక్కాలో సానియా మీర్జా ను కలిసిన ఆ హీరోయిన్

Dilquer SalmanNaga ShauryaRashmika MandannaTrendingUpdatesViral
Comments (0)
Add Comment