Mufasa The Lion King Sensational : జియో హాట్ స్టార్ లో ముఫాసా ద ల‌య‌న్ కింగ్

ప్రిన్స్ మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ తో క్రేజీ

Mufasa The Lion King : చిత్రం విచిత్రం భ‌ళారే విచిత్రం అన్న‌ట్టుగా మారి పోయింది సినీ లోకం. ఇప్పుడు ప్రాంతాల మ‌ధ్య స‌రిహ‌ద్దులు చెరిగి పోయాయి. ఇంట‌ర్నెట్ లో కొత్త పుంత‌లు తొక్క‌డం, టెక్నాలజీలో మార్పులు చోటు చేసుకోవ‌డంతో సినిమాలు, వెబ్ సీరీస్, సీరియ‌ల్స్, షార్ట్ ఫిలింస్, డాక్యుమెంట‌రీలు ప్రతి రోజూ ప‌ల‌క‌రించేందుకు వ‌స్తున్నాయి. రా ర‌మ్మంటూ పిలుస్తున్నాయి. ఈ త‌రుణంలో యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది ఒకే ఒక్క సినిమా. అందులో హీరోలు , హీరోయిన్లు అంటూ ఉండ‌రు. కానీ జంతువులు అంటాయి.

Mufasa The Lion King OTT Updates

రాజు, రాణి, సైనికులు..ఇలా ప్ర‌తి పాత్ర దేనిక‌దే ప్ర‌త్యేకం. మ‌రి సినీ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న న‌టుడు అంద‌గాడైన మ‌హేష్ బాబు. త‌న‌కు ఎంత‌గానో న‌చ్చిన మూవీ ఏమిటంటే కేవ‌లం జంతువుల‌తో చేసిన హాలీవుడ్ మూవీ ..ముఫాసా ద ల‌య‌న్ కింగ్(Mufasa The Lion King). త‌ను ఎంతో ప్రాణ ప్రదంగా ప్రేమించిన ఈ మూవీకి త‌నే వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం విశేషం. దీంతో ఈ సినిమాకు సంబంధించి అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ఇక థియేట‌ర్ల‌లో కాకుండా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు ముఫాసా ద ల‌య‌న్ కింగ్ సిద్ద‌మైంది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో మ‌హేష్ బాబు అభిమానులు తెగ సంబుర‌ప‌డి పోతున్నారు. కార‌ణం త‌మ అభిమాన న‌టుడి గొంతులోంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో త‌మ న‌టుడే స్వ‌యంగా ఈ సినిమాలో న‌టించినంత‌గా ఫీల్ అవుతున్నారు. ఎక్క‌డ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా క‌టౌట్ల‌తో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల‌లో మహేష్ బాబు ఫ్యాన్స్ ర‌చ్చ చేస్తున్నారు. ఇంత‌కు ముఫాసా ద ల‌య‌న్ కింగ్ లో ఏముందో చూడాలంటే ముందుగా జియో హాట్ స్టార్ లోకి వెళ్లాలి.

Also Read : Hero Vijay Antony Bhadrakali : విజ‌య్ ఆంటోనీ భ‌ద్ర‌కాళి టీజ‌ర్ రిలీజ్

MufasaOTTTrendingUpdates
Comments (0)
Add Comment