Mrunal Thakur: సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో పాన్ ఇండియాలో రేంజ్ లో ప్రేక్షకులకు దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. ఇటీవలే నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి సినిమాలో అతిథిపాత్రలో మెరిసిన ఈ బ్యూటీ…. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాల్లో ఆఫర్లు అందుకుంటోంది. సీతారామం సినిమాతో స్వచ్చమైన ప్రేమకథను అందించి ఈ బ్యూటీ మరో స్వచ్ఛమైన ప్రేమకథతో బాలీవుడ్ లో కూడా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
Mrunal Thakur Movie Updates
‘బేబీ జాన్’, ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్… తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ సరసన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ను ఎంపిక చేసారు. ఓ స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న ఈ జంట… ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ఈ సినిమాతో మృణాల్, వరుణ్‌ల సరికొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను ముంబయిలో ముగించింది చిత్రబృందం. ముక్కోణపు ప్రేమకథగా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్రలో మెరవనుంది. త్వరలో పూర్తి వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Also Read : Vikram: ‘చియాన్ 63’ కు విక్రమ్ గ్రీన్ సిగ్నల్ !