Mrunal Thakur : క‌థ న‌చ్చితే వెబ్ సీరీస్ కు ఓకే

అందాల ముద్దుగుమ్మ మృణాళ్

Mrunal Thakur : టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్ద‌రి ముద్దుగుమ్మ‌ల‌దే హ‌వా కొన‌సాగుతోంది. ఒక‌రు శ్రీ‌లీల అయితే మ‌రొక‌రు మృణాల్ ఠాకూర్. ఇద్ద‌రి చేతుల్లో మంచి సినిమాలు ఉన్నాయి. ఇక మృణాల్ ఠాకూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Mrunal Thakur Viral

త‌ను బాలీవుడ్ లో న‌టించినా ఆశించిన మేర ఆద‌ర‌ణ ల‌భించ లేద‌ని, కానీ తెలుగులో తాను చేసిన సీతారామం త‌న‌కు ఎన‌లేని పేరు తీసుకు వ‌చ్చేలా చేసింద‌ని పేర్కొంది. ఈ మూవీ విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఇదే స‌మ‌యంలో త‌ను నానితో క‌లిసి తాజాగా హాయ్ నాన్న సినిమాలో న‌టిస్తోంది. ఈ మూవీ డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది.

మరో వైపు మెగాస్టార్ న‌టిస్తున్న సాంఘిక నేప‌థ్యం క‌లిగిన చిత్రంలో ఓ పాత్ర‌లో న‌టిస్తోంది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఇక ఇప్ప‌టికే ఓ వెబ్ సీరీస్ లో కూడా న‌టించింది. అది గ‌నుక స్ట్రీమింగ్ అయితే గ‌నుక త‌ప్ప‌నిస‌రిగా త‌న‌కు మంచి పేరు తీసుకు వ‌స్తుంద‌న్న‌న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసింది మృణాల్ ఠాకూర్.

అయితే దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క బెట్టుకుందామ‌నే ఆలోచ‌న‌లో ఉంది. త‌న‌కు సినిమాలే కాదు ఏదైనా చేసేందుకు ఓకే అంటోంది. వెబ్ సీరీస్ లో ఛాన్స్ గ‌నుక వ‌స్తే తాను న‌టించేందుకు రెడీ అంటూ వెల్ల‌డించింది. సో మృణాల్ కు తానేం చేయాల‌నే దానిపై పూర్తి ప‌ట్టు ఉంద‌న్న‌మాట‌.

Also Read : Irugapatru Movie : నెట్ ఫ్లిక్స్ లో ఇరుగ‌పాట్రు

Comments (0)
Add Comment