Mrunal Thakur: ప్రభాస్‌ కు జోడీగా ‘సీతారామం’ బ్యూటీ !

ప్రభాస్‌ కు జోడీగా ‘సీతారామం’ బ్యూటీ !

Mrunal Thakur: ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన బాలీవుడ్ నటి మృణాల్‌ ఠాకూర్‌. ‘సీతారామం’ తరువాత నేచురల్ స్టార్ నానితో ‘హాయ్‌ నాన్న’ సినిమాలో నటించి మరో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్‌’ నటిస్తున్న ఈ బ్యూటీ… త్వరలో ప్రభాస్‌ సరసన నటించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ హీరో ప్రభాస్… ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌ లో తెరకెక్కించబోయే ఓ పీరియాడికల్‌ డ్రామాలో ఈమె నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. ప్రభాస్ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మృణాల్‌ను(Mrunal Thakur) ఎంపిక చేశారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Mrunal Thakur Movie with Prabhas

ప్రస్తుతం ప్రభాస్‌… వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’తోపాటు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సీజ్ ఫైర్ కు సీక్వెల్ గా తెరకెక్కించబోయే ‘సలార్‌ శౌర్యాంగపర్వం’ లో నటించనున్నారు. ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్… విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : Salman Khan: అనంత్ అంబానీకి సల్మాన్ ఖాన్ స్పెషల్ గిఫ్ట్ ?

Hanu RaghavapudiMrunal ThakurPrabhas
Comments (0)
Add Comment