Mrunal Thakur : ఆ పాత్ర‌ను మ‌రిచి పోలేను

న‌టి మృణాల్ ఠాకూర్ కామెంట్

Mrunal Thakur : ఇటు బాలీవుడ్ లో అటు టాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారి పోయింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). అశ్వ‌నీ ద‌త్ నిర్మించిన సీతారామం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇందులో న‌ట‌న‌కు గాను మృణాల్ కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత నానితో హాయ్ నాన్న చేసింది. ఇది కూడా ప‌క్కా హిట్ అన్న టాక్ వినిపిస్తోంది.

Mrunal Thakur Memories

ఇదిలా ఉండ‌గా తాజాగా పిప్పాలో న‌టిస్తోంది. త‌న‌కు అద్భుత‌మైన పాత్ర ద‌క్కింద‌ని, దీనిని త‌న జీవితంలో మ‌రిచి పోలేనంటోంది ఈ మ‌రాఠా బొమ్మ‌. ఇదిలా ఉండ‌గా ది బ‌ర్నింగ్ చాఫీస్ న‌వ‌ల ఆధారంగా పిప్పా పేరుతో తెరకెక్కిస్తున్నారు. వైద్య విద్యార్థిని పాత్ర‌. ముఖ్యంగా యుద్ద రంగంలో సేవ‌లు అందించే సీన్స్ ఉన్నాయ‌ని త‌న హృద‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని పేర్కొంది మృణాల్ ఠాకూర్.

ఇందులో నా పాత్ర పేరు రాధ‌. ఇది ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నా. ఎందుకంటే మ‌హిళ‌లంటే చుల‌క‌న భావం ఉంది. ఈ పాత్ర పూర్తిగా న‌మ్మ‌కాన్ని, ధైర్యాన్ని క‌లిగి ఉంటుంది. పిప్పా సినిమా వ‌చ్చాక త‌న కంటే రాధ ఎక్కువ‌గా ఫోక‌స్ అవుతుంద‌ని పేర్కొంది.

మొత్తంగా మీద ఈ ఏడాది మృణాల్ ఠాకూర్ కు భారీ ఎత్తున అవ‌కాశాలు రావ‌డం విశేషం.

Also Read : Satyabhama Teaser : కాజ‌ల్ స‌త్య‌భామ టీజ‌ర్

Comments (0)
Add Comment