Spirit Movie : ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్ ఆమెనట

దీంట్లోప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే!

Spirit : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పై ఉన్నాయి. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరోపక్క ‘కల్కి -2’, ‘సలార్‌-2 చిత్రాల పనులు జరుగుతున్నాయి. సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో ప్రభాస్‌ చేసే స్పిరిట్‌(Spirit) చిత్రం కూడా త్వరలో సెట్స్‌ మీదకెళ్లనుందని ఇటీవల దర్శకుడు ఓ వేదికపై చెప్పారు. భూషణ్‌కుమార్‌ నిర్మించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. డిసెంబరు నెలాఖరున ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలోనే టాలీవుడ్, బాలీవుడ్ లలో ట్రెండింగ్ లో ఉన్న ఓ బ్యూటీ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

Spirit Movie Updates

తాజా సమాచారం ప్రకారం ‘సీతారామం’ సినిమాతో కెరీర్ పీక్ ని చూసిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరిగణిస్తున్నారట. ప్రస్తుతం చర్చలు అయితే మొదలయ్యాయి కానీ.. సందీప్ ఓకే చేస్తే అగ్రిమెంట్ కూడా పూర్తవుతుందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు ఇద్దరి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ.. ప్రభాస్ వైఫ్ రోల్ లో నటించేందుకు మృణాల్ కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తారు అనే వార్తలను కరీనా కొట్టిపడేసిన విషయం తెలిసిందే.

దీంట్లోప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే! దీనికి సంబంధించిన లుక్‌ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇందులో ‘యానిమల్‌’లోని రణ్‌బీర్‌ పాత్ర తరహాలో మరో రెండు కొత్త లుక్స్‌లోనూ అలరించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నెలలోనే సినిమాని లాంఛనంగా ప్రారంభించి.. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతారు. అక్కడి నుంచి ఆరు నెలల్లోనే సినిమాని పూర్తి చేయనున్నట్లు చిత్ర నిర్మాత ఇటీవల వెల్లడించారు. . దీన్ని బట్టి ఇది వచ్చే ఏడాదిలోనే తెరపైకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడు.

Also Read : Manchu Manoj : బన్నీ రిలీజ్ పై స్పందించిన హీరో మంచు మనోజ్

CinemaSpiritTrendingUpdatesViral
Comments (0)
Add Comment