మృణాల్‌తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన సింగర్
Mrunal Thakur : సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన పిప్పా సినిమా విజయవంతం కావడంతో జోష్ మీద ఉన్న ఈ ముంబై భామపై… పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మృణాల్ ఠాకూర్ పెళ్ళిపై గతంలో ఓ అవార్డు ఫంక్షన్ వేదికగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మృణాల్ ఠాకూర్ ఓ తెలుగు అబ్బాయిని పెళ్ళి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. దీనితో ఆమె ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన పెళ్ళిపై క్లారిటీ ఇచ్చింది.
అయితే ఈ సారి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) డేటింగ్ లో ఉందంటూ ఇప్పుడు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం ముంబై వేదికగా నటి శిల్పాశెట్టి నిర్వహించిన దీవాళీ బాష్ లో పాల్గొన్న మృణాల్ ఫోటోలు వైరల్ అవ్వడమే కారణమట. తన ఇన్ స్టా అకౌంట్ లో ఫోస్ట్ చేసిన ఫోటోలో ఈ సీతారామం బ్యూటీ… బాద్ షా అనే సింగర్ తో చనువుగా ఉండటమే కాకుండా ‘నాకు అత్యంత ఇష్టమైన వారు’ అని క్యాప్షన్ రాశారు. దీనితో వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
Mrunal Thakur – డేటింగ్ పై స్పందించిన సింగర్ బాద్ షా
సింగర్ బాద్ షాతో మృణాల్ డేటింగ్ లో ఉందంటూ వస్తున్న వార్తలపై ఇంతవరకు సీతారామం బ్యూటీ స్పందించకపోయినప్పటికీ… సింగర్ బాద్ షా మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘డియర్ ఇంటర్నెట్… మరోసారి నిరాశపరుస్తున్నందుకు క్షమించు… ప్రస్తుతం వస్తోన్న వార్తలేవీ నిజం కాదు’ అంటూ ఫన్నీ ఎమోజీని పోస్ట్ చేశాడు సింగర్ బాద్ షా. దీంతో మృణాల్, బాద్ షా పై వస్తున్న డేటింగ్ వార్తలకు చెక్ పడినట్లైంది.
అసలు ఎవరీ బాద్ షా
బాలీవుడ్ లో నటుడిగా, సింగర్ గా గుర్తింపు పొందిన బాద్ షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ శిసోడియా. పాడిన తొలి పాటతోనే అత్యధిక వ్యూస్ సాధించి మంచి ర్యాప్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో నటుడిగా, ర్యాప్ సింగర్ గా, నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.
Also Read : Kanguva Movie : కాటేస్తున్న సూర్య కంగువ