Mrs India 2024 : మిస్సెస్ ఇండియా 2024 కిరీటాన్ని సొంతం చేసుకున్న విశాఖ యువతి

విశాఖ లో జన్మించిన హేమలత రెడ్డి.. టీవీ షోలలో పనిచేశారు...

Mrs India 2024 : మలేషియాలో జరిగిన గ్లామన్ మిస్సెస్ ఇండియా 2024(Mrs India 2024) పోటీల్లో తెలుగు వనిత హేమలత రెడ్డి విజేతగా నిలిచారు. సెప్టెంబర్ చివరి వారంలో జరిగిన ఈ పోటీల్లో.. ప్రపంచ వ్యాప్తంగా 300మంది పాల్గొన్నారు. వారిలో తెలుగు మహిళ హేమలతా రెడ్డి.. ఫస్ట్ ప్లేస్ లో నిలిచి గ్లామన్ మిస్సెస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను విశాఖలో.. సత్కరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ తో పాటు పలువురు హాజరై హేమలత రెడ్డి ని అభినందించారు. హేమ లతా రెడ్డి అందరికీ స్ఫూర్తి అని, ఫ్యాషన్ అనేది మనలో ఒక భాగం అయ్యిందని, ఇంకా మరెన్నో టైటిల్స్ గెలుపొంది, విశాఖ పేరు నిలపాలని అభినందించారు.

Mrs India 2024 winner..

విశాఖ లో జన్మించిన హేమలత రెడ్డి.. టీవీ షోలలో పనిచేశారు. హ్యాపీ డేస్ సీరియల్ లో లీడ్ రోల్ చేసిన ఆమె.. జగపతి బాబు మూవీ ప్రవరాఖ్యుడు లో నటించారు. అలాగే హీరోయిన్ గా నిన్నే చూస్తూ సినిమా కు నిర్మాత గా కూడా వ్యవహరించారు. అక్కడ నుండి గ్లామాన్ మిసెస్ ఇండియా లో ప్రపంచ వ్యాప్తంగా 300 మందితో పోటీపడి విజేతగా నిలిచారు. త్వరలో ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు హేమలత రెడ్డి.

Also Read : Chiranjeevi : నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణం విచారం వ్యక్తం చేసిన చిరంజీవి

2024Mrs IndiaTrendingUpdatesViral
Comments (0)
Add Comment