Mr Bachchan Updates : వెకేషన్ తర్వాత షూటింగ్ స్పీడ్ పెంచిన మాస్ మహారాజ్

అలాగే ఈ షెడ్యూల్‌తో 50 శాతం సినిమా పూర్తి కాబోతుందని తెలుస్తోంది

Mr Bachchan : మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నటించిన చిత్రాలేమీ ఊహించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. తాజాగా రాబోయే చిత్రంతో ఎలాగైనా హిట్‌ అందుకోవాలని కసిగా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో `మిస్టర్‌ బచ్చన్‌` (Mr Bachan) సినిమా చేస్తున్నారు. షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్‌ షెడ్యూల్‌ లక్నోలో షురూ అయింది. త్వరలోనే రవితేజ సెట్స్‌లో జాయిన్‌ కాబోతున్నారు. లక్నోలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం.

అలాగే ఈ షెడ్యూల్‌తో 50 శాతం సినిమా పూర్తి కాబోతుందని తెలుస్తోంది. రవితేజ(Raviteja) ఇప్పటికే షూటింగ్‌ నుంచి విరామం తీసుకొని ఫ్యామిలీ వెకేషన్‌ కోసం యూఎస్‌ వెళ్లి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్‌ లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ పోజ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ని అలరించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

Mr Bachchan Updates Viral

రవితేజ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మిస్టర్‌ బచ్చన్‌ టైటిల్‌ పెట్టడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ‘మిస్టర్‌ బచ్చన్‌’..నామ్‌ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా గ్రాండ్‌గా లాంఛ అయింది. రవితేజ కథానుగుణంగా అమితాబ్‌బచ్చన్‌ అభిమానిగా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి ఆయనంక బోస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా వర్క్‌ చేస్తున్నారు.

Also Read : Operation Valentine : సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైన వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’

CinemaravitejaTrendingUpdatesViral
Comments (0)
Add Comment