Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, ధమాకా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో విడుదలైన తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్(Mr Bachchan)’. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటించారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. 2018లో హిందీలో వచ్చిన ‘రైడ్’ అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
Mr Bachchan Movie…
దీనితో ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమాను అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. ‘మిస్టర్ బచ్చన్’ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్‌గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్‌కి వచ్చి ఉండేదేమో ? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : SS Rajamouli: మహేశ్‌బాబు రాజమౌళి ల ప్రాజెక్ట్ పేరు ‘గరుడ’ ?