Hero Balayya-Daaku Maharaaj : బాల‌య్య డాకు మ‌హారాజ్ మూవీ సూప‌ర్

సోద‌రి, ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కామెంట్

Daaku Maharaaj : త‌న సోద‌రుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ, మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్ క‌లిసి న‌టించిన డాకు మ‌హారాజ్ చిత్రం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు సోద‌రి, ఏపీ బీజేపీ చీఫ్, రాజ‌మండ్రి బీజేపీ ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి(MP Purandeswari). బాప‌ట్ల జిల్లా చీరాల లోని మోహ‌న థియేట‌ర్ లో సినిమాను కుటుంబ సమేతంగా చూశారు. చిత్రంలో సామాజిక‌, సందేశాత్మ‌క అంశాల‌తో పాటు బాల‌య్య న‌ట‌న కెవ్వు కేక అనిపించేలా ఉంద‌న్నారు.

Daaku Maharaaj Movie..

మూవీ మేక‌ర్స్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి. ఇదిలా ఉండ‌గా సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా డాకు మ‌హారాజ్(Daaku Maharaaj) చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేశారు. ఈ చిత్రంతో పాటు రామ్ చ‌ర‌ణ్ తేజ్ , కియారా అద్వానీ క‌లిసి న‌టించిన శంక‌ర్ తీసిన గేమ్ ఛేంజ‌ర్ , మినిమం గ్యారెంటీ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ కూడా విడుద‌ల‌య్యాయి.

ఈ చిత్రాల‌న్నీ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్నాయి. ఇదిలా ఉండ‌గా బాల‌కృష్ణ న‌ట‌న ప‌రంగా సూప‌ర్ గా న‌టించారు. తొలి రోజే బిగ్ హిట్ టాక్ రావ‌డంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది బాల‌య్య మూవీకి. ఈ చిత్రానికి బాబ్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మించారు.

Also Read : Hero Thalaiva-Jailer 2 : జైల‌ర్ -2 సీక్వెల్ మూవీ ప్రోమో రిలీజ్

CinemaDaaku MaharaajTrendingUpdates
Comments (0)
Add Comment