Mouni Roy : మౌని రాయ్ షోపై ఉత్కంఠ

టెంప్టేష‌న్ ఐలాండ్ ఇండియా

Mouni Roy : ఇప్పుడు వినోద రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో టెక్నాల‌జీ మారింది. ఈ ప్ర‌క్రియ ఇప్పుడు ఎంట‌ర్టైన్మెంట్ రంగానికి విస్త‌రించింది. దీంతో టాలెంట్ క‌లిగిన న‌టీ న‌టులు, టెక్నీషియ‌న్స్ , ద‌ర్శ‌క‌, నిర్మాత‌లకు ఎక్క‌డా లేనంత‌గా అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. సినిమాల‌తో పాటు బుల్లి తెర‌, ఓటీటీలు ఇప్పుడు రాజ్యాం ఏలుతున్నాయి.

Mouni Roy Show Viral

ఇదే స‌మ‌యంలో మోస్ట్ పాపుల‌ర్ షోగా పేరు పొందింది ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేటింగ్ తో దూసుకు పోతోంది టెంప్టేష‌న్ ఐలాండ్. ఈ షో ద్వారా ఇండియాకు రాబోతోంది. దీనిని ప్రజెంట్ చేస్తున్నారు మౌని రాయ్(Mouni Roy). ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వైర‌ల్ గా మారారు సామాజిక మాధ్య‌మాల‌లో.

ఇందులో ఎంపిక చేసిన జంట‌లు ఉంటారు. వారు షో సంద‌ర్బంగా త‌మ వ్య‌క్తిగ‌త అనుభ‌వాల‌ను పంచుకుంటారు. అయితే త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి తాను చ‌ర్చించ‌నంటూ హొయ‌లు పోయింది వ‌య్యారాల మౌనీ రాయ్.

ఈ షో అమెరికాకు చెందిన రియాల్టీ షో ఇది. తొలి సీజ‌న్ తో భార‌త్ కు రాబోతుండ‌డం విశేషం. టెంప్టేష‌న్ ఐలాండ్ ఇండియాను భార‌త్ కు చెందిన మౌని రాయ్ తో పాటు క‌ర‌ణ్ కుంద్రా హోస్ట్ చేస్తారు.

Also Read : Amala Paul Kiss : అమ‌లా పాల్ స‌ర్ ప్రైజ్ గిఫ్ట్

Comments (0)
Add Comment