Mohanlal: ప్రయోగాత్మక కథలు… వైవిధ్యమైన పాత్రలు… విభిన్నమైన గెటప్స్‌ను ఎంచుకుంటూ మలయాళంతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్(Mohanlal). మన్యంపులి, జనతా గ్యారేజ్, ఇటీవల జైలర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. లిజో జోష్ పెల్లిస్సేరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మలైకోటై వాలిబన్’ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన… మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. తన తదుపరి చిత్రం ‘ఎల్360’ కోసం ‘ఆపరేషన్ జావా’ ఫేమ్ దర్శకుడు తరుణ్ మూర్తితో చేతులు కలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేసారు.
Mohanlal Movie Updates
‘‘నా 360వ చిత్రం కోసం తరుణ్‌మూర్తి, ఎమ్.రెంజిత్‌లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తరుణ్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుకు కేఆర్ సునీల్ స్క్రిప్ట్ అందించారు. రెజపుత్ర విజువల్ మీడియా పతాకంపై ఎమ్.రెంజిత్ దీన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రీకరణను ప్రారంభించనున్నాము’’ అని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనితో ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్) సినిమాపై అంచానాలు భారీగా పెరిగిపోయాయి.
Also Read : Samantha: సినిమాలు లేకపోయినా రెమ్యునరేషన్ డబుల్ చేసిన సమంత !