Mohanlal: కామన్‌ మ్యాన్‌గా మోహన్‌లాల్‌ !

కామన్‌ మ్యాన్‌గా మోహన్‌లాల్‌ !

Mohanlal: ప్రయోగాత్మక కథలు… వైవిధ్యమైన పాత్రలు… విభిన్నమైన గెటప్స్‌ను ఎంచుకుంటూ మలయాళంతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌(Mohanlal). మన్యంపులి, జనతా గ్యారేజ్, ఇటీవల జైలర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. లిజో జోష్ పెల్లిస్సేరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మలైకోటై వాలిబన్‌’ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు. దృశ్యం తరువాత మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన ‘నెరు’ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. దీనితో వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ జోరు మీదున్న మోహన్‌లాల్‌ ఇదే ఊపులో మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

Mohanlal…

సత్యన్‌ అంతిఖడ్‌ దర్శకత్వంలో ‘హృదయపూర్వం’ అనే చిత్రాన్ని ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్‌ కామన్‌మ్యాన్‌ పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి దర్శకుడి కుమారుడు అనూప్‌ సరికొత్త అప్‌డేట్‌ అందించారు. ‘మోహన్‌లాల్‌-సత్యన్‌ కలయికలో మరో సూపర్‌ ఫన్‌ ప్రాజెక్టు ముస్తాబు కానుంది. ఇది వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది’ అని వ్యాఖ్యానిస్తూ దర్శకనిర్మాతలతో మోహన్‌లాల్‌ కలిసి ఉన్న ఫొటోని పంచుకున్నాడు. మోహన్‌లాల్‌-సత్యన్‌ కలయికలో గతంలో వచ్చిన ఆరు చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాకి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందించనున్నారు.

Also Read : Bharateeyudu 2: ‘భార‌తీయుడు 2’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ !

DrushyamMohanlal
Comments (0)
Add Comment