Mohanlal: నాలుగేళ్ల తర్వాత సెట్స్‌ పైకి మోహన్ లాల్ ‘రామ్‌’ !

నాలుగేళ్ల తర్వాత సెట్స్‌ పైకి మోహన్ లాల్ ‘రామ్‌’ !

Mohanlal: ప్రయోగాత్మక కథలు… వైవిధ్యమైన పాత్రలు… విభిన్నమైన గెటప్స్‌ను ఎంచుకుంటూ మలయాళంతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌. మన్యంపులి, జనతా గ్యారేజ్, ఇటీవల జైలర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. లిజో జోష్ పెల్లిస్సేరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మలైకోటై వాలిబన్‌’ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ కు మలయాళంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ఉంది. దీనికి కారణం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దృశ్యం దాదాపు అన్ని భాషల్లో కూడా రీమేక్ కావడం. దృశ్యం తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నెరు’ సినిమాలో విజయ్‌ మోహన్‌ అనే న్యాయవాది పాత్రలో మోహన్ లాల్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేసారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగేళ్ళ క్రితం ప్రకటించిన సినిమా ‘రామ్‌’ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

Mohanlal Movies

ఇటీవల ‘మలైకోటై వాలిబన్‌’గా తెరపై కనిపించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మోహన్‌లాల్‌(Mohanlal)… జీతూ జోసెఫ్ దర్శకత్వమంలో ‘రామ్‌’తో తనలోని మరో కోణాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నారు. ‘నెరు’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో త్రిష కథానాయిక. ఈ ప్రాజెక్టు ప్రకటించి నాలుగేళ్లు అయినప్పటికీ… అనివార్య కారణాల వల్ల షూటింగ్‌ ను ప్రారంభించలేదు. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులో మళ్లీ మొదలు పెట్టడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రలో రా ఏజెంట్‌గా కనిపించనున్నారు మోహన్‌లాల్‌. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రమేశ్‌, సుధన్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘కన్నప్ప’, ‘బరోజ్‌’ తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు మోహన్‌లాల్‌.

Also Read : Ramya Krishnan: రాజమౌళి పిలుపుకోసం ఎదురుచూస్తున్న ‘శివగామి’ ?

Jeethu JosephMohanlalRam
Comments (0)
Add Comment