Mohanlal: ప్రయోగాత్మక కథలు… వైవిధ్యమైన పాత్రలు… విభిన్నమైన గెటప్స్‌ను ఎంచుకుంటూ మలయాళంతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్. మన్యంపులి, జనతా గ్యారేజ్, ఇటీవల జైలర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన లిజో జోష్ పెల్లిస్సేరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘మలైకోట్టై వాలిబన్’ సినిమాలో నటిస్తున్నారు. మోహన్ లాల్(Mohanlal) సరసన సోనాలి కులకర్ణి నటిస్తుంది. పిరియాడికల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్… రెజ్లర్ పాత్రలో కనిపించనున్నారు.
Mohanlal – డిసెంబరు 6న ‘మలైకోట్టై వాలిబన్’ టీజర్
అయితే వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కానున్న ఈ ‘మలైకోట్టై వాలిబన్’ సినిమాకు సంబందించిన టీజర్ ను డిసెంబరు 6న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీజర్ కంటే ముందు ‘మలైకోట్టై వాలిబన్’ పోస్టర్ ను సోషల్ మీడియాలో ఉంచింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌లో రెజ్లర్ పాత్రలో కనిపిస్తున్న మోహన్ లాల్ సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంతేకాదు టీజర్ తో పాటు సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేస్తున్నారు.
Also Read : Janhvi Kapoor: మాజీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆధ్యాత్మిక సేవలో జాన్వీ కపూర్