Mohan Lal: ఓటీటీలో మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ సినిమా ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఓటీటీలో మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ సినిమా ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Mohan Lal: ‘దృశ్యం’ ఫేం జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా సినిమా ‘నేరు’. కోర్టు రూమ్‌ డ్రామాగా డిసెంబరు 21న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుని… రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రియమణి, అనస్వర రాజన్‌, సిద్ధిక్ నటన హైలైట్‌ గా నిలిచింది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా జనవరి 23వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ‘నేరు’ సినిమా మలయాళంలో హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని… ఇతర భాషా ప్రేక్షకులు కూడా వేచి చూసేలా చేసింది. దీనితో ‘నేరు’ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు జనవరి 23 నుండి మ‌ల‌యాళంతో పాటు, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హాందీ భాష‌ల్లో అందుబాటులోకి రానుంది.

Mohan Lal – ‘నేరు’ కథేమిటంటే ?

సారా మహ్మద్‌ (అనస్వర రాజన్‌) అనే అంధురాలు అత్యాచారానికి గురవుతుంది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది ఎవరో గుర్తించలేక పోలీసులు సైతం ఓ దశలో చేతులు ఎత్తేస్తారు. స్వతహాగా శిల్పి అయిన సారా తనపై దారుణానికి ఒడిగట్టి వ్యక్తి రూపాన్ని తయారు చేస్తుంది. ఆ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైఖేల్‌ జోసెఫ్‌ (శంకర్‌ ఇందుచూడన్‌) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేస్తారు. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు కావడంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. ఎంతటి క్లిష్టమైన కేసునైనా తన వాదనా పటిమతో గెలిపించగలిగే రాజశేఖర్‌ (సిద్ధిఖ్‌)ను మైఖేల్‌ తండ్రి అడ్వకేట్‌ గా నియమించుకుంటాడు. దీనితో మైఖేల్‌ కు బెయిల్‌ వస్తుంది.

ఈ కేసును వాపసు తీసుకోమని మైఖేల్‌ కుటుంబం నుంచి సారాకు సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ వస్తుంది. అయితే, అందుకు భిన్నంగా తాను న్యాయం కోసం పోరాటం చేస్తానని సారా చెబుతుంది. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ సూచన మేరకు సారా లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌-Mohan Lal)ను కలిసి… తన కేసు వాదించమని కోరుతుంది. ఇంతకీ సారాపై అత్యాచారం చేసింది ఎవరు ? విజయ్‌ మోహన్‌ కేసు టేకప్‌ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ? విజయ్‌మోహన్‌, పూర్ణిమా రాజశేఖర్‌ (ప్రియమణి)ల మధ్య ఉన్న బంధం ఏంటి ? చివరకు అత్యాచారం చేసిన వ్యక్తిని ఎలా పట్టుకున్నారు ? అనే విషయాలను ఎంతో ఆశక్తికరంగా తెరకెక్కించడంతో పాటు కోర్టు రూం డ్రామాను ఇంట్రెస్టింగ్ గా చూపించారు దర్శకుడు జీతూ జోసెఫ్.

Also Read : Indian Police Force: ఓటీటీలో దుమ్మురేపుతోన్న బాలీవుడ్ స్టార్స్ తొలి వెబ్ సిరీస్‌ !

Mohan LalNeru
Comments (0)
Add Comment