Mohan Babu : నటుడు మోహన్‌బాబు తన లైసెన్స్‌డ్ గన్‌ను సరెండర్ చేశారు. తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. వారం రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వివాదాల గురించి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, కుమారుడు మనోజ్ ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించారు.
Mohan Babu Handover..
మరోవైపు జల్‌పల్లిలో తన నివాసం వద్ద జరిగిన ఘటనపై మోహన్‌బాబు తాజాగా స్పందించారు. ఉద్దేశపూర్వకంగా జర్నలిస్ట్‌ని కొట్టలేదని చెప్పారు.అనుకోకుండా జరిగిన పొరపాటు అంటే జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు.ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్‌బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఈ సందర్బ?ంగా అతని కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు.
Also Read : SSMB29 Movie : మహేష్ బాబు, రాజమౌళి సినిమా నుంచి అప్డేట్