Mohan Babu : మంచు మనోజ్ పై ఫిర్యాదు చేసిన తండ్రి మోహన్ బాబు

నేను మీకు చెప్పిన చిరునామాలో 10 సంవత్సరాలుగా నివసిస్తున్నాను...

Mohan Babu : మంచు మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీస్ కమీషనర్‌కు మోహన్ బాబు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని.. రక్షణ కావాలని ఈ ఫిర్యాదులో మోహన్ బాబు(Mohan Babu) కోరారు.

Mohan Babu – ‘‘కమిషనర్ఆఫ్ పోలీస్ రాచకొండ కమిషనరేట్, హైదరాబాద్ వారికి

నేను మీకు చెప్పిన చిరునామాలో 10 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. నాలుగు నెలల క్రితం నా ఇంటి నుండి బయటికి వెళ్లిన నా చిన్న కుమారుడు మనోజ్ డిసెంబర్ 8వ తేదీన కొంతమంది సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. మనోజ్(Manoj), మౌనిక దంపతులు 7 నెలల పసిపాపని ఇంటి పనిమనిషి సంరక్షణలో విడిచిపెట్టారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు నేను పడుకుని ఉన్నప్పుడు మళ్లీ నా ఇంటికి వచ్చాడని తెలిసింది.

ఆమరుసటి రోజు నేను నా పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు కొందరు అపరిచితులను నా ఇంటి చుట్టూ తిరగడం గమనించాను. అదే సమయంలో మాదాపూర్‌లోని నా ఆఫీస్‌లోకి మంచు మనోజ్ అనుచరులమని ఓ 30 మంది వ్యక్తులు చొరబడి.. ఈ ఆస్తి మాది, మా అనుమతి లేకుండా ఎవరూ లోపలికి రాలేరని బెదిరించినట్లుగా, అక్కడి నా ఆఫీస్ సిబ్బంది కాల్ చేసి చెప్పారు. మంచు మనోజ్, మౌనికల సూచనల మేరకు ఆఫీస్‌ని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారు. దీంతో నా భద్రత, నా విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నాను. నాకు హాని కలిగించేలా వారి చర్యలున్నాయి. నన్ను ఇళ్లు ఖాళీ చేయించి, వారు ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని కొంతమంది సంఘ విద్రోహులతో కలిసి నన్ను, నా కుటుంబంలో ఉన్నవారిని బెదిరిస్తున్నారు.

వారిబెదిరింపులు చూస్తుంటే.. బలవంతంగానైనా నా ఇంటిని చట్టవిరుద్ధంగా లాక్కోవాలని వారు ప్లాన్ చేసినట్లుగా నాకు అర్థమవుతోంది. నేను దాదాపు 78 ఏళ్ల నిండిన సీనియర్ సిటిజన్‌ని. మనోజ్, అతడి భార్య మౌనిక, వారి సహచరులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే నా భద్రత నిమిత్తం అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరుతున్నాను. నా ఇంట్లో నేను ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఉండేలా రక్షణ కల్పించాలని విన్నవించుకుంటున్నాను’’ అని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరో వైపు మంచు మనోజ్ కూడా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఎవరెవరిపై ఫిర్యాదు చేశారనేది తెలియలేదు కానీ.. ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఓ ఫొటో వైరల్ అవుతోంది. దీంతో మొత్తంగా మంచు ఫ్యామిలీ వ్యవహారం హాట్ హాట్‌గా మారింది.

Also Read : Trivikram-Allu Arjun : డైరెక్టర్ త్రివిక్రమ్ తో తదుపరి సినిమాకి సిద్ధమవుతున్న బన్నీ

BreakingManchu ManojManchu Mohan BabuPolice CaseUpdatesViral
Comments (0)
Add Comment