Siraj : క్రికెట్ కు సినిమా రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. గతంలో చాలా మంది క్రికెటర్లు సినీ హీరోయిన్లతో ప్రేమలో పడ్డారు. మరికొందరు పీకలలోతు ప్రేమలో కూరుకు పోయారు. తాజాగా హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్(Siraj) సంచలనంగా మారారు. ప్రముఖ సింగర్ ఆశా భోంస్లే మనుమరాలు జనై భోంస్లేతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ గా మారాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.
Siraj-Zanai Bhosle Love…
తను ఈ మధ్యనే ముంబైలో పుట్టిన రోజు జరుపుకుంది ఈ గాయని. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ, క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులు, ఆటగాళ్లు హాజరయ్యారు. జనై భోంస్లేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకించి తన కోసం సిరాజ్ అటెండ్ కావడం విశేషం. తను భారత క్రికెట్ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలం పాటలో ఏకంగా రూ. 12.50 కోట్లకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది.
ఈసారి జరిగే ఐపీఎల్ లో తను బెంగళూరుకు కాకుండా గుజరాత్ తరపున ఆడనున్నాడు. ప్రస్తుతం జనై భోంస్లే పలు సినిమాలకు పాటలు పాడుతోంది. త్వరలోనే మూవీస్ లో కూడా నటించనున్నట్లు టాక్. తను తాజాగా ఇన్ స్టా పేజీలో ప్రత్యేకించి మహ్మద్ సిరాజ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు తెగ ప్రచారం జరుగుతోంది.
Also Read : Beauty Nidhhi Agerwal : ఆ మూవీపై ముద్దుగుమ్మ కామెంట్స్