Avneet Kaur : ఇండియాలో సినిమా రంగానికి క్రికెటర్లకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. స్టార్ క్రికెటర్లను ప్రేమించడం అలవాటుగా మారింది. ఎందుకంటే స్టార్ డమ్ ఎక్కువగా ఈ రెండు రంగాలకు ఉంటోంది. దీంతో ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారో, ఎవరిని ప్రేమిస్తున్నారో , డేటింగ్ లో ఉన్నారో ఇట్టే తెలిసి పోతుంది. తాజాగా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు శుభ్ మన్ గిల్. తను దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కీలక పాత్ర పోషించాడు.
Avneet Kaur – Shubh Man Gill
ఇదే సమయంలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్బంగా తనను ప్రేమించే టీవీ నటి అవ్ నీత్ కౌర్(Avneet Kaur) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. దీనికి కారణం ఇద్దరూ అక్కడ తారస పడడం. దీంతో ఇటు సినీ ఫ్యాన్స్ అంటు క్రికెటర్ అభిమానులు ఎంచక్కా ఈ ఇద్దరూ లవ్ లో కూరుకు పోయారంటూ ఇందుకు మ్యాచ్ కారణమని పేర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం శుభ్ మన్ గిల్, అవ్ నీత్ కౌర్ డేటింగ్ లో ఉన్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో ప్రొడ్యూసర్ రాఘవ్ శర్మతో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇదే సమయంలో గత ఏడాది శుభ్ మన్ గిల్ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపింది. తనతో ప్రత్యేకంగా దిగిన ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గతంలో శుభ్ మన్ గిల్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమలో కూరుకు పోయాడు. ఎందుకనో వీరిద్దరి మధ్య బంధం బెడిసి కొట్టినట్లుంది. తన స్థానంలో అవనీత్ కౌర్ వచ్చి చేరింది.
Also Read : Hero Karthik Aryan :కార్తీక్ ఆర్యన్ భార్య డాక్టరై ఉండాలి