MM Keeravani : సంగీత అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి. ఇప్పటికే అల్లా రఖా రెహమాన్ , దేవిశ్రీ ప్రసాద్ , అనిరుధ్ రవిచందర్ , తదితర మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా వీరి జాబితాలోకి చేరారు కీరవాణి. తను తెలుగు, తమిళం, హిందీ సినిమాలకు సంగీతం అందించారు. తన సినీ కెరీర్ లో పేరు పొందిన పాటలతో కూడిన సంగీత కచేరి చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇందుకు వేదికగా హైదరాబాద్ ఎంచుకున్నట్లు తెలిపాడు ఎంఎం కీరవాణి.
MM Keeravani Music Concert
ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశామన్నాడు. లైవ్ సంగీత కచేరి మార్చి 22న నగరంలోని హైటెక్స్ లో జరుగుతుందని వెల్లడించారు. తన కచేరికి నా టూర్ అని పేరు కూడా పెట్టాడు. పాత సినిమాల నుండి ఇటీవల రిలీజ్ అయిన హరి హర వీర మల్లు సినిమా వరకు టాప్ సాంగ్స్ ను కచేరి సందర్బంగా వినిపించనున్నారు. శ్రోతలను అలరించనున్నారు.
ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీత కచేరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇదిలా ఉండగా తన సినిమాలన్నీ తన సోదరుడు కీరవాణితోనే చేయడం విశేషం. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుతో చేస్తున్న మూవీకి కూడా తనే మ్యూజిక్ అందిస్తున్నారు. తాను కూడా తన సోదరుడి మ్యూజిక్ కన్సర్ట్ కోసం వేచి చూస్తున్నానని చెప్పాడు.
Also Read : Anil Ravipudi- Strong Reaction :ఫేక్ వీడియోలపై డైరెక్టర్ సీరియస్