Mithun Chakraborty : షూటింగ్ లో ఛాతి నొప్పితో కుప్పకూలిన బాలీవుడ్ సీనియర్ నటుడు

మిథున్ చక్రవర్తి ఈరోజు ఉదయం తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది

Mithun Chakraborty : బాలీవుడ్‌లో ప్రముఖ నటులు, రాజకీయ నాయకులలో ఒకరైన మిథున్ చక్రవర్తి తీవ్ర అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఛాతి నొప్పితో బాధపడుతున్న మిథున్ చక్రవర్తి కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఒకప్పటి స్టార్ హీరో మరియు డిస్కో డ్యాన్సర్ అనేక చిత్రాలలో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు కూడా మిథున్ చక్రవర్తికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రి పాలయ్యారనే వార్త తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. వైద్యులు అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇప్పటివరకు, మిథున్ చక్రవర్తి అనారోగ్యం లేదా ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆసుపత్రి సిబ్బంది ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

Mithun Chakraborty Health Updates

మిథున్ చక్రవర్తి ఈరోజు ఉదయం తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు.. షూటింగ్ లో నొప్పితో నేలపై కూర్చున్నట్టు, చిత్ర బృందం గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read : Guntur Kaaram OTT : ఓటీటీలోను దిమ్మతిరిగే వసూళ్లతో ‘గుంటూరు కారం’

ActorBollywoodBreakingCommentsUpdatesViral
Comments (0)
Add Comment