పరిణీతి చోప్రా నెట్టింట్లో వైరల్ గా మారారు. ఇటీవలే ఆమె పెళ్లి చేసుకుంది. అతడు ఎవరో కాదు ప్రముఖ రాజకీయ నాయకు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. వీరి ఫోటోలు వైరల్ గా మారాయి. ఇంతలోనే పరిణీతి చోప్రా అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన మిషన్ రాణిగంజ్ మూవీలోని కిమ్తీ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో రొమాన్స్ పండింది. ప్రేయసీ ప్రియుల మధ్య సాగే పాట ఇది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, సాంగ్ వీడియో హల్ చల్ చేస్తోంది. ఓ వైపు పెళ్లి. ఇంతలోనే రొమాంటిక్ సాంగ్ ఆసక్తికరంగా మారింది.
ఇందుకు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ లో అక్షయ్ కుమార్ స్వయంగా పోస్ట్ చేశాడు. ఎక్కడ చూసినా ఈ ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి. ఒకరకంగా ట్రెండింగ్ లో నిలిచాయి. కీమ్తీ సాంగ్ కు స్వర కర్త విశాల్ మిశ్రా. వినసొంపుగా ప్రేమ పూర్వకమైన పాటగా ఉంది. దీనిని మరింత దగ్గరగా వినేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్.
ఈ సాంగ్ ను రూపొందించడమే కాదు విశాల్ మిశ్రా పాడారు కూడా. దీనికి సాహిత్యం కౌశల్ కిషోర్ అందించారు. అక్టోబర్ 6న మిషన్ రాణిగంజ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.