బాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న నటుల్లో అక్షయ్ కుమార్ ఒకడు. ఏడాదికి ఎక్కువ సినిమాలు తీయక పోయినా మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు పొందాడు. అతడి చేతిలో లెక్కకు మించిన కంపెనీలు ఉన్నాయి. ఒక్క యాడ్స్ ద్వారానే వందల కోట్లు సంపాదిస్తాడనే పేరుంది.
మిగతా హీరోలకంటే మనోడికి మంచి బిజినెస్ టాలెంట్ ఉంది. ఇంకేం కేంద్ర ప్రభుత్వం అండ కూడా ఉంది. అంతే కాదు తాను తలుచుకున్నప్పుడల్లా ప్రధాన మంత్రితో భేటీ అయ్యేంత చనువు కూడా ఉంది. ఇది పక్కన పెడితే తన నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మిషనర్ రాణీగంజ్.
ఇందులో అక్షయ్ కుమార్ తో పాటు ప్రముఖ నటి , ప్రియాంక చోప్రా రిలేషన్ అయిన పరిణీతి చోప్రా కీలక పాత్రలో నటించింది. వీరిద్దరికి సంబంధించిన కీమ్తి సాంగ్ ఇటీవల విడుదలై భారీ ఆదరణను చూరగొంది. అయితే చిత్రం విడుదలైంది. కానీ ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆకట్టు కోలేక పోయిందన్న అపవాదు మూట గట్టుకుంది.
కనీసం బీ, సీ సెంటర్లలోనైనా తన సినిమా గట్టెక్కుతుందని భావిస్తున్నారు నటుడు అక్షయ్ కుమార్. మొత్తంగా డైరెక్టర్ పనితనం కూడా ఇందులో ఉన్నప్పటికీ ఎందుకని ఆదరించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది .