Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిష్ట‌ర్ పోలిశెట్టి అదుర్స్

భారీ ఎత్తున మూవీకి జ‌నాద‌ర‌ణ‌

Miss Shetty Mr Polishetty : నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి క‌లిసి న‌టించిన మిస్ శెట్టి మిష్ట‌ర్ పోలిశెట్టి చిత్రం భారీ ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా ఎక్క‌డా క‌లెక్ష‌న్ల ప‌రంగా త‌గ్గ‌డం లేదు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన్మెంట్ , కామెడీ తో రూపొందించాడు ద‌ర్శ‌కుడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా పోటా పోటీగా న‌టించారు న‌టీ, న‌టులు న‌వీన్, అనుష్క‌.

Miss Shetty Mr Polishetty Trending

ఓ వైపు జైల‌ర్ ఇంకో వైపు జ‌వాన్ సినిమాలు ఉన్న‌ప్ప‌టికీ మిస్ శెట్టి మిష్ట‌ర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) మినిమం గ్యారెంటీతో దూసుకు పోతోంది. ఏ, బీ సెంట‌ర్ల‌లో కూడా ఈ సినిమాను ఆద‌రిస్తుండ‌డం విశేషం. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం విడుద‌లైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

మిస్ శెట్టి మిష్ట‌ర్ పోలిశెట్టి చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు పి. మ‌హేష్ బాబు. చెఫ్ గా అనుష్క శెట్టి వంద మార్కులు కొట్టేసింది. ఇక జాతి ర‌త్నాలు మూవీతో త‌న‌కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క‌లిగిన న‌వీన్ పోలిశెట్టి సైతం అద్భుతంగా న‌టించాడు . ఓవ‌ర్సీస్ లో కూడా చిత్రాన్ని ఆద‌రిస్తుండ‌డం విశేషం.

క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే 1వ రోజు రూ. 2.6 కోట్లు, 2వ రోజు రూ. 2.58 కోట్లు, 3వ రోజు రూ. 2.50 కోట్లు, 4వ రోజు రూ. 3.8 కోట్లు 5వ రోజు రూ. 1.75 కోట్లు క‌లెక్ష‌న్లు సాధించింది. ఈ సినిమాలో న‌వీన్ , అనుష్క‌తో పాటు జ‌య‌సుధ‌, ముర‌ళీ శ‌ర్మ‌, నాజ‌ర్ , తుల‌సి, అభిన‌వ్ , సోనియా దీప్తి, కేశ‌వ్ దీప‌క్ న‌టించారు.

Also Read : Pushpa2 Update : పుష్ప‌2 రిలీజ్ డేట్ ఫిక్స్

Comments (0)
Add Comment