Minu Munner : జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందించిన మరో నటి ‘మిను మునీర్’

దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌పై బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఆరోపణలు చేశారు...

Minu Munner : ప్రస్తుతం దక్షిణాదితోపాటు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ చర్చనీయాంశంగా మారిన విషయం జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ . గతవారంగా ఏ చిత్ర పరిశ్రమలో చూసిన ఇదే టాపిక్‌ నడుస్తోంది. దీంతో పలువురు తారలు తమకు ఎదురైన పరిస్థితుల గురించి ధైౖర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలియజేస్తూ నటి మిను మునీర్‌(Minu Munner) తాజాగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. మలయాళ(Malayali) చిత్ర పరిశ్రమకు చెందిన నటుల వల్ల వేధింపులకు గురయ్యానని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ప్రముఖ నటుడు జయసూర్యతోపాటు,ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు, చంద్రశేఖరన్ , ప్రొడక్షన్ కంట్రోలర్‌ నోబెల్‌, విచు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ చేశారు.

Minu Munner Comment

‘‘ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు, జయసూర్య, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ నోబల్‌, విచు వల్ల చాలా వేధింపులు ఎదుర్కొన్నాను. అసభ్య పదజాలంతో నన్ను అవమానించారు. 2013లో ఒక ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నప్పుడు నాకు ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. మరో సినిమా షూటింగ్‌లో చేదు అనుభవం ఏంటంటే..నేను వాష్‌రూమ్‌కి వెళ్లి బయటకు రాగానే జయసూర్య నా సమ్మతి లేకుండా వెనక నుంచి వచ్చి హత్తుకుని ముద్దులు పెట్టాడు. నేను షాకై అక్కడి నుంచి నలుగురు ఉన్న చోటికి పారిపోయా. అతనితో ఉంటూ, అతని కోరికలు తీరిస్తే మరెన్నో ఆఫర్లు ఇస్తానని కూడా చెప్పాడు. మరో సందర్భంలో మలయాళ(Malayali) మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ కార్యదర్శి ఇడవేల బాబును సభ్యత్వం కోసం సంప్రదించగా, అతను తన ప్లాట్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.

దీని వల్ల అధికార సీపీఐ పార్టీ ఎమ్మెల్యే, నటుడు ముఖేష్‌ అడ్వాన్స్ ఇవ్వడానికి తిరస్కరించి, సభ్యత్వం లేకుండా చేశాడు. ఇలాంటివి ఎన్నో తట్టుకుని సినిమా కోసం పని చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు హద్దులు దాటాయి. మలయాళం చిత్రపరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారు. వీటికి నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను మలయాళ సినిమాను వదిలి చెన్నైకు వెళ్తున్న సమయంలో కూడా సమస్య ఏంటి అని అడిగిన వారు లేరు. ఈ సంఘటన గురించి గతంలోనే స్థానిక పత్రికలతో మాట్లాడాను. ఈ సంఘటన వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయా. న్యాయం జరగాలని కోరుకుంటున్నా. వారు చేసిన పనికి తగిన శిక్ష అనుభవించాలి’’ అని ఆమె పోస్ట్‌ పెట్టారు.

మలయాళ(Malayali) చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హేమ కమిటీ రిపోర్ట్‌ ను ప్రభుత్వానికి నివేదించింది. దాదాపు ఏడేళ్ల పాటు వర్క్‌ చేసి ఈ నివేదికను సిద్థం చేశారు. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ విషయాలపై మొదట గళమెత్తారు బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర. దర్శకనిర్మాతలు, నటుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు గురించి ఇప్పుడు పలువురు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడారు.

దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌పై బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఆరోపణలు చేశారు. తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారన్నారు. చిత్రీకరణలో భాగంగా ఒక నటుడు తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని నటి సోనియా మల్హార్‌ ఆరోపించారు. దీంతో ఆయన కేరళ చలన చిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నటి రేవతి సంపత్‌ చేసిన ఆరోపణలతో ‘ఏఎంఎంఏ’ జనరల్‌ సెక్రటరీ పదవి నుంచి నటుడు సిద్థిఖీ వైదొలిగారు. ప్రస్తుతం దీనిపై మంజు వారియర్‌, గీతూ మోహన్‌దాస్‌ స్పందిస్తూ.. నిజం వెల్లడయింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి’’ అని అన్నారు.

Also Read : Sai Pallavi : కొత్త పాత్రల కోసం చూస్తున్న లేడీ పవర్ స్టార్ ‘సాయి పల్లవి’

ActressBreakingMollywoodUpdatesViral
Comments (0)
Add Comment