Minister Komatireddy : టాలీవుడ్ సినీ కార్మికులకు సంబంధించి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శుభవార్త చెప్పారు. అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఇళ్లు ఇప్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.అదేవిధంగా చిన్న సినిమాలు తీసే వారికి థియేటర్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు.
Minister Komatireddy Comment
సోమవారంతెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు సినిమాలు అంటే చాలా ఇష్టమని అన్నారు. మన రాష్ట్రంలో చాలా ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారన్నారు. వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా తెలంగాణ వారికీ ఉందన్నారు. లోకల్ టాలెంట్‌ను అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతనే తనకు సన్మానం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Also Read : Kamal Haasan : నన్ను అలా పిలవద్దంటూ కమల్ హాసన్ బహిరంగ లేఖ