Mimi Chakraborty: కోల్‌ కతా బాధితురాలికి సపోర్ట్ చేసిన హీరోయిన్‌ కి బెదిరింపులు !

కోల్‌ కతా బాధితురాలికి సపోర్ట్ చేసిన హీరోయిన్‌ కి బెదిరింపులు !

Mimi Chakraborty: కోల్‌ కతాలోని ఆర్‌.జి.కార్‌ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌ ని అత్యాచారం చేసి దారుణంగా చంపిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా బాధితురాలికి మద్దత్తు పలుకుతూ… నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కోల్‌ కతాలోనూ కొన్నిరోజుల క్రితం అలానే ర్యాలీ జరిగింది. సాక్షాత్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆ ర్యాలీలో పాల్గొంది. ఈ క్రమంలోనే ఆ ర్యాలీలో పాల్గొన్న హీరోయిన్‌ మినీ చక్రవర్తికి ఇప్పడు బెదిరింపులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

Mimi Chakraborty Comment

డాక్టర్ హత్యకు నిరసనగా ర్యాలీలో పాల్గొన్నందుకుగానూ తనని కూడా అత్యాచారం చేసి చంపుతామని బెదిరిస్తున్నారని మిమీ చక్రవర్తి చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్‌ ని తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే… కొందరేమో సోషల్ మీడియాలో అత్యాచార బెదిరింపులు చేస్తున్నారని రాసుకొచ్చింది. అంతేకాదు ఈ పోస్టుకు ఆమె సైబర్ క్రైమ్ పోలీసుల్ని ట్యాగ్ చేసింది.

2008 నుంచి సీరియల్స్ చేసిన మిమీ చక్రవర్తి(Mimi Chakraborty)… 2012 నుంచి సినిమాల్లో హీరోయిన్‌ గా నటించడం మొదలుపెట్టింది. 2014-2024 మధ్య మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎంపీగానూ పనిచేసింది. సీనియర్ నటిగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ఈమెకు కూడా బెదిరింపులు రావడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు, ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Sonakshi Sinha : రెండు నెలలకే పెళ్లి జరిగిన ఇంటిని అమ్మకానికి పెట్టిన ‘సోనాక్షి’

Kolkata doctor rape-murder caseMimi Chakraborty
Comments (0)
Add Comment