Mika Singh-Saif Attack : సైఫ్ ను సేఫ్ చేసిన ఆటో డ్రైవ‌ర్ కు న‌జ‌రానా

ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సింగ‌ర్ మికా సింగ్

Saif : ప్ర‌ముఖ పాప్ సింగ్ మికా సింగ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ ను సుర‌క్షితంగా త‌న ఆటోలో ఎక్కించుకుని లీలావ‌తి ఆస్ప‌త్రికి చేర్చాడు డ్రైవ‌ర్. త‌న‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఒక‌వేళ త‌ను గ‌నుక జ‌న‌వ‌రి 16న తీసుకోక పోయి ఉండి ఉంటే సైఫ్(Saif) బ‌తికి ఉండే వాడు కాద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఆస్ప‌త్రి వైద్యులు. వారు కూడా ఆటో డ్రైవ‌ర్ ను మెచ్చుకున్నారు. త‌ను చేసిన సాయం జీవితంలో మ‌రిచి పోలేనంటూ కితాబు ఇచ్చారు న‌టుడు సైఫ్ అలీఖాన్ సైతం.

Saif- Mika Singh Helps Auto Driver…

త‌ను అభిమానించే సైఫ్ ను కాపాడినందుకు సింగర్ మికా సింగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఆటో డ్రైవ‌ర్ కు త‌న వంతుగా ఒక ల‌క్ష రూపాయ‌లు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. త‌ను త్వ‌ర‌లోనే వాటిని అందించేలా ఏర్పాటు చేస్తాన‌ని తెలిపాడు.

ఆటో డ్రైవ‌ర్ రాణాను ప్ర‌శంసల‌తో ముంచెత్తాడు. ఇలాంటి వాళ్లు ఉండ‌బ‌ట్టే స‌మాజంలో ధ‌ర్మం ఇంకా బ‌తికే ఉంద‌ని పేర్కొన్నాడు మికా సింగ్. త‌న ఆచూకి తెలియ చేస్తే తాను ప్ర‌క‌టించిన మొత్తాన్ని ఇవ్వ‌గ‌ల‌నంటూ తెలిపాడు.

ఇదిలా ఉండ‌గా సైఫ్ అలీ ఖాన్ త‌ల్లి కూడా ఆటో డ్రైవ‌ర్ ను ఆశీర్వ‌దించారు. చ‌ల్లంగా బ‌త‌కాల‌ని దీవించారు. దుండ‌గుడి దాడిలో సైఫ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న న‌టుడిని ఆస్ప‌త్రికి సుర‌క్షితంగా చేర్చాడు రాణా.

Also Read : IT- Shocking Tollywood : టాలీవుడ్ లో కొన‌సాగుతున్న ఐటీ రైడ్స్

HelpingSaif Ali KhanUpdatesViral
Comments (0)
Add Comment