Megha Akash: రాహుల్ గాంధీని కలిసిన నితిన్ బ్యూటీ మేఘా ఆకాష్‌ !

రాహుల్ గాంధీని కలిసిన నితిన్ బ్యూటీ మేఘా ఆకాష్‌ !

Megha Akash: తెలుగు, తమిళ చిత్రపరిశ్రమల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరోయిన్‌ మేఘా ఆకాష్. 2017లో నితిన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లై సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత వెంట‌నే చ‌ల్ మోహ‌న‌రంగా సినిమాలోనే న‌టించి మెప్పించింది. ‘ఛల్‌ మోహన్‌ రంగా’, ‘రాజ రాజ చోర’, ‘డియర్‌ మేఘా’, ‘పేట’, ‘కుట్టి స్టోరీ’, ‘రాధే’ వంటి చిత్రాల్లో మేఘా ఆకాశ్‌ నటించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘పేట్ట’ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన మేఘా ఆకాష్‌… ఆ తర్వాత ధనుష్‌ సరసన ‘ఎన్నై నోక్కి పాయుం తోట్టా’, సింబుతో ‘వందా రాజావా దాన్‌ వరువేన్‌’తో పాటు ఇతర హీరోలతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఆమె చివరిసారిగా ‘సభానాయగన్‌’, ‘వడకుపట్టి రామస్వామి’, ‘మళై పిడిక్కాద మణిదన్‌’ చిత్రాల్లో నటించారు.

Megha Akash Meet…

తన ప్రియుడు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌.తిరునావుక్కరసు రెండో కుమారుడు సాయి విష్ణును ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు మేఘా ఆకాశ్(Megha Akash). చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌ లో వీరి వివాహంలో ఇరు కుటుంబాల పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తరువాత నిర్వహించిన వెడ్డింగ్‌ రిసెప్షన్‌ కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై నూతన జంటకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ తన భర్తతో కలిసి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వారి వెంట టీఎన్‌సీసీకి చెందిన సీనియర్‌ నేత ఎస్‌.తిరునావుక్కరసు కూడా ఉన్నారు. చెన్నై నగరంలో జరిగిన వీరి రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళి, రాహుల్‌ గాంధీని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

Also Read : Game Changer: ‘ది సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్’ వీడియో రిలీజ్ !

Megha AkashRahul Gandhi
Comments (0)
Add Comment