Megha Akash: తెలుగు, తమిళ చిత్రపరిశ్రమల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్(Megha Akash). 2017లో నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంటనే చల్ మోహనరంగా సినిమాలోనే నటించి మెప్పించింది. ఆపై తమిళ సినిమాలవైపు దృష్టి పెట్టిన ఈ తెలుగందం రెండు భాషల్లో వచ్చిన ప్రతి అవకాశాన్నిఅందిపుచ్చుకుంటు సినిమాలు చేస్తోంది. ఆపై తమిళ సినిమాల వైపు దృష్టి పెట్టిన ఈ తెలుగు బ్యూటీ రెండు భాషల్లో వచ్చిన ప్రతి అవకాశాన్నిఅందిపుచ్చుకుంటు సినిమాలు చేస్తోంది. తాజాగా తన చిరకాల ప్రియుడు సాయివిష్ణుతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Megha Akash Marriage Updates..
తన ప్రియుడు సాయి విష్ణుతో ఏడడుగులు వేశారు. ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శనివారం సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై నూతన జంటకు అభినందనలు తెలిపారు. మేఘా ఆకాశ్(Megha Akash) సోషల్ మీడియాలో రిసెప్షన్ ఫొటోలు షేర్ చేసి జీవితంలో తనకెంతో ఇష్టమైన అధ్యాయం ఇదేనని పేర్కొన్నారు.
రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో ఆమె ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించిన ఆమె… ఆ తర్వాత ‘వందా రాజావాదాన్ వరువేన్’, ‘బూమరాంగ్’, ‘ఎన్నై నోక్కిపాయుం తోట్టా’, ‘వడకుపట్టి రామస్వామి’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ‘ఛల్ మోహన్ రంగా’, ‘రాజ రాజ చోర’, ‘డియర్ మేఘా’, ‘పేట’, ‘కుట్టి స్టోరీ’, ‘రాధే’ వంటి చిత్రాల్లో మేఘా ఆకాశ్ నటించారు. ఇటీవలే విజయ్ ఆంటోని తుఫాన్ అనే తమిళ సినిమాతో అలరించిన మేఘ ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో చేస్తోంది. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
Also Read : Amala Paul: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్ !