Megastar New Movie : మెగాస్టార్ చిరంజీవితో బింబిసార దర్శకుడు వశిష్ట కొత్త సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇప్పటికే మెహర్ రమేష్ తీసిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలైంది. తన కెరీర్ లో బిగ్ డిజాస్టర్ గా నిలిచింది.
Megastar New Movie Update
కానీ ఎక్కడా తగ్గడం లేదు సూపర్ స్టార్ . తాజాగా ఎంవీ క్రియేషన్స్ చిరంజీవితో (Megastar)సినిమా తీస్తున్నట్లు పేర్కొంది. ఇక వశిష్ట అసలు పేరు ఎంవీఎన్ రెడ్డి. వల్లిడి వశిష్ట అని పిలుస్తారు సినీ ఇండస్ట్రీలో. గతంలో ఆయన తీసిన బింబిసార బిగ్ సక్సెస్ గా నిలిచింది. టేకింగ్ లో , మేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చాడు.
రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందాడు. 2022లో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నందమూరి కళ్యాణ్ రామ్ తో సోషియో ఫాంటసీ తో బింబిసారను తెరకెక్కించాడు. ఇదే వశిష్టకు తొలి చిత్రం కావడం విశేషం. మల్లిడి వశిష్ట జనవరి 8న 1986లో చెన్నైలో పుట్టారు. బన్నీ, ఢీ, భగీరథ తదితర చిత్రాలను నిర్మించిన ఏస్ ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ మల్లిడి సత్య నారాయణ రెడ్డి కుమారుడే ఈ వశిష్ట.
చెన్నైలో ప్రాథమిక విద్య అనంతరం హైదరాబాద్ కు వచ్చాడు వశిష్ట. ఇక్కడే ఉన్నత విద్య పూర్తి చేశాడు. సినిమా మీద ఉన్న కసితో దర్శకుడిగా, రచయితగా మారాడు. కొత్త దర్శకుడి కథ నచ్చడంతో మెగాస్టార్ ఓకే చెప్పారు.
Also Read : Keerthy Suresh : అట్లీ జైలర్ అదుర్స్ – కీర్తి సురేష్