Hero Allu Arjun-Megastar :అల్లు అర్జున్ మూవీలో మెగాస్టార్..?

బాల‌కృష్ణ కూడా చేరే ఛాన్స్

Allu Arjun : ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 తో మ‌రోసారి రికార్డ్ సృష్టించాడు. దేశంలోనే అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన చిత్రంగా పుష్ప‌2 నిలిచింది. దీంతో మ‌నోడి స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇప్ప‌టికే రూ . 1867 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ వెకేష‌న్ పూర్త‌య్యాక తిరిగి హైద‌రాబాద్ కు వ‌చ్చాడు. తాజాగా బ‌న్నీ, స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ తో చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

Megastar in Allu Arjun Movie

ఇదిలా ఉండ‌గా తొలుత ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో చ‌ర్చ‌లు మొద‌లు పెట్టాడు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన మూవీస్ బిగ్ స‌క్సెస్ అయ్యాయి. జులాయి తీశాడు అది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత తీసిన పూజా హెగ్డేతో క‌లిసి తీసిన అల వైకుంఠ‌పురంలో చిత్రం భారీ ఎత్తున క‌లెక్ష‌న్స్ సాధించింది. ఎవ‌రూ ఊహించ‌ని స‌క్సెస్ కావ‌డంతో త‌ను త్రివిక్ర‌మ్ తో కొత్త మూవీకి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిపాడు.

అంత‌లోపు త‌ను స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో పుష్ప మూవీలో అద్భుతంగా న‌టించాడు. ఇదే స‌మ‌యంలో సీక్వెల్ వ‌చ్చిన పుష్ప‌2 చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. కాగా ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తో కాకుండా త‌మిళ సూప‌ర్ డైరెక్ట‌ర్ అట్లీతో క‌మిట్ అయ్యాడు అల్లు అర్జున్. ఇప్ప‌టికే ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నను తీసుకున్న‌ట్లు టాక్. మ‌రో సీనియ‌ర్ పాత్ర‌లో చిరంజీవి లేదా బాల‌కృష్ణ‌ను తీసుకునే ప‌నిలో డైరెక్ట‌ర్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో ఐదుగురు హీరోయిన్లు ఉండ‌నున్న‌ట్లు తెలిసింది.

Also Read : Hero Rajinikanth- Coolie: కూలీ తెలుగు రైట్స్ కు రూ. 40 కోట్ల ఆఫ‌ర్

allu arjunMegastar ChiranjeeviTrendingUpdates
Comments (0)
Add Comment