Megastar Chiranjeevi: పద్మశ్రీ గ్రహీతలను సత్కరించిన మెగాస్టార్ !

పద్మశ్రీ గ్రహీతలను సత్కరించిన మెగాస్టార్ !

Megastar: మెగాస్టార్ చిరంజీవి… హీరోగానే కాదు వ్యక్తిత్వంలోనూ నెంబర్ వన్ అని మరోసారి నిరూపించారు. ఇటీవల మెగస్టార్ చిరంజీవికి దేశంలో రెండో అత్యున్నత పురష్కారం పద్మ విభూషణ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు మెగాస్టార్ ఇంటికి స్వయంగా వెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అందరూ వచ్చి చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతుంటే… చిరంజీవి మాత్రం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించి… మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు.

తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, యాదాద్రి ఆలయ శిల్పి డాక్టర్ ఆనందచారి వేలును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. వారిని దుశ్సాలువాతో సత్కరించి, ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దీనితో చిరంజీవిని మరోసారి ఆకాశానికి ఎత్తేస్తున్నారు అభిమానులు.

Megastar Chiranjeevi Viral

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ… “అంతరించిపోతున్న యక్షగాన కళారూపానికి జీవం పోసినందుకు గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన కళలతో పాటు కళాకారులను కాపాడుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే శిల్పకళలో వినూత్న సేవలు అందించిన ఆనందచారి వేలుకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిలతో చేపట్టిన పునర్నిర్మాణంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. శిఖరాగ్రస్థాయిలో ఉన్న చిరంజీవి… తమను వారి ఇంటికి ప్రత్యేక ఆహ్వానం పంపించి, సత్కరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని ఈ సందర్భంగా సమ్మయ్య, వేలు సంతోషం వ్యక్తంచేశారు.

Also Read : Samantha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత !

Megastar ChiranjeeviPadma Awards
Comments (0)
Add Comment