Anil Ravipudi : సినీ రంగానికి సంబంధించి చాలా మంది నటీ నటులు, సాంకేతిక నిపుణులు మెగాస్టార్ ను చూసి ఇంప్రెస్ అయిన వారే. అందులో చెప్పుకోవాల్సింది మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరొందిన అనిల్ రావిపూడి(Anil Ravipudi). తను తీసింది కొన్ని సినిమాలే అయినా అన్నీ బ్లాక్ బస్టర్లే కావడం విశేషం.
Anil Ravipudi Shocking Updates
తను తాజాగా విక్టరీ వెంకటేశ్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం రికార్డుల మోత మోగించింది. ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి సినీ వర్గాలను ఆశ్చర్య పోయేలా చేసింది . పూర్తి కామెడీ, వినోదం ప్రధానంగా ఉండేలా చిత్రీకరించే అనిల్ రావిపూడికి తన జీవితంలో ఒక్కసారైనా చిరంజీవితో సినిమా చేయాలని కల.
ఎన్నో ఏళ్లుగా తను వెయిట్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ తో పటాస్ తీశాడు. అది హిట్. మాస్ మహరాజా రవితేజతో రాజా దిగ గ్రటే్ తో ఒక్కసారి సినీ ఇండస్ట్రీ తన వైపు తిప్పుకునేలా చేశాడు. ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వురు అంటూ బాక్సులు బద్దలు కొట్టాడు. ఇక ఎఫ్ 2 తో వరుణ్ తేజ్ , విక్టరీ వెంకటేశ్ తో కాసులు కురిపించాడు. దానికి సీక్వెల్ గా ఎఫ్ 3తో వచ్చాడు. అది కూడా హిట్టే. నందమూరి నట సింహం బాలకృష్ణతో భగవంత్ కేసరీ తీసి ఔరా అనిపించేలా చేశాడు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో హ్య్యాటిక్ కొట్టాడు.
లైలా మూవీ ప్రీ ఈవెంట్ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన మనసులోని మాట చెప్పేశాడు. తను నటిస్తున్న విశ్వంభర షూటింగ్ అయిపోతోందని, ఇక స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన కథకు ఓకే చెప్పానని అన్నాడు. దీంతో తనతో మూవీ కన్ ఫర్మ్ అయిపోయినట్టేనని చెప్పకనే చెప్పేశాడు మెగాస్టార్. ఇది పూర్తిగా నవ్వుల అల్లరితో ఉంటుందన్నాడు.
Also Read : Beauty Meenakshi :మీనాక్షి చౌదరి సొగసు చూడతరమా