Megastar Chiru: ‘సలార్‌’పై చిరంజీవి రివ్యూ

‘సలార్‌’పై చిరంజీవి రివ్యూ

Megastar Chiru: కేజిఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘సలార్‌’. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రివ్యూ ఇవ్వగా.. తాజాగా చిరంజీవి ‘సలార్‌’ సినిమాపై ప్రశంసలు జల్లు కురిపించారు. ‘సలార్‌’ సినిమాలోని పలు అంశాలను ప్రస్తావిచండంతో పాటు చిత్ర యూనిట్ ను అభినందిస్తూ తన సోషల్‌ మీడియా అకౌంట్ లో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం చిరంజీవి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Megastar Chiru – ఎక్స్ వేదిక ద్వారా చిరంజీవి ఎమన్నారంటే…

‘‘దేవా పాత్రతో ఆకట్టుకున్న ప్రభాస్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘సలార్‌: సీజ్ ఫైర్‌’ బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది. ఇంత గొప్ప సినిమాను అందించిన ప్రశాంత్‌ నీల్‌కు అభినందనలు. ఆయన సినీరంగంలో మరింత రాణిస్తారు. ఇక ఇందులో వ‌ర‌ద రాజమ‌న్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, ఆద్యగా శ్రుతిహాస‌న్, అలాగే క‌ర్త రాజ మ‌న్నార్ పాత్రలో జ‌గ‌ప‌తిబాబు అద్భుతంగా నటించారు. టెక్నికల్‌ టీమ్‌ పనితీరు కూడా ప్రశంసనీయంగా ఉంది. ఇంత పెద్ద విజయం సాధించినందుకు అందరికీ అభినందనలు’’ అంటూ చిరంజీవి(Megastar Chiru) తన పోస్ట్ లో రాసుకొచ్చారు. దీనితో ఈ పోస్ట్‌ను ప్రభాస్‌ తో పాటు మెగాస్టార్ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

మరోవైపు ‘సలార్‌’ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ఏమన్నారంటే… వింటేజ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ యాక్షన్‌ మోడ్‌లో అదరగొట్టాడు. ఈ మాస్‌ అనుభూతి నుంచి బయటకు రావాలంటే చాలా రోజులు పడుతుంది. దర్శకుడితో పాటు చిత్రబృందానికి నా అభినందనలు అన్నారు దర్శకుడు మారుతి. ప్రభాస్‌ను అభిమానులు కోరుకున్న విధంగా ప్రశాంత్ నీల్‌ చూపించారు. వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. భారీ విజయాన్ని సాధించినందుకు ‘సలార్‌’లో భాగమైన అందరికీ అభినందనలు. రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నా… అంటూ పోస్ట్ చేసారు ప్రభాస్ స్నేహితుడు, నటుడు గోపిచంద్‌ .

Also Read : Director KR: ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం… ఈ సినిమా తోనే…

Chiranjeevisalar
Comments (0)
Add Comment