Megastar Chiranjeevi: బెంగుళూరు వాసులకు మెగాస్టార్ సలహా ! వైరల్ గా మారుతున్న ట్వీట్ !

బెంగుళూరు వాసులకు మెగాస్టార్ సలహా ! వైరల్ గా మారుతున్న ట్వీట్ !

Megastar Chiranjeevi: బెంగుళూరులో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ గా మారింది. బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి నేపథ్యంలో చిరు సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బెంగుళూరులోని తన ఫామ్‌ హౌస్‌లో అవలంభించిన పద్ధతులను ఆయన ఈ ట్వీట్ లో వివరించారు. తన ఫామ్ హౌస్‌ లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఫోటోలను పంచుకున్నారు. అంతే కాకుండా తన ట్వీట్‌ ను కన్నడ భాషలో రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్(Megastar Chiranjeevi) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Megastar Chiranjeevi Comment

చిరంజీవి ప్రస్తుతం యూవీ క్రియోషన్స్ బ్యానర్ పై బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ లో నటిస్తున్నారు. చిరు కెరీర్ లో అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత సోషియోఫాంటసీ జానర్ లో పూర్తిస్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. 2006లో వచ్చిన స్టాలిన్ తర్వాత త్రిష మరోసారి చిరంజీవితో జతకట్టనుంది. ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.కి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు’ అని ఈ సినిమాపై దర్శకుడు వశిష్ఠ అంచనాలు పెంచేశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. దీనితో ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Anasuya Bharadwaj: జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధమంటోన్న అనసూయ !

BangloreMega Star ChiranjeeviViswambhara
Comments (0)
Add Comment