Megastar Chiranjeevi: చికున్ గున్యాతో బాధపడుతున్న మెగాస్టార్ చిరంజీవి !

చికున్ గున్యాతో బాధపడుతున్న మెగాస్టార్ చిరంజీవి !

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికున్ గున్యాతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. సుమారు 25రోజుల నుండి చికున్ గున్యాకు చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే చికున్‌ గున్యా నుంచి ఆయన ఉపశమనం పొందుతున్నట్లు తెలుస్తోంది. 156 సినిమాలు… 537 పాటలు… 24 వేల డ్యాన్స్ స్టెప్పులు వేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మెగాస్టార్ చోటు దక్కించుకున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిచర్డ్స్, బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో చికున్ గున్యాతో బాధపడుతున్నప్పటికీ మెగాస్టార్(Megastar Chiranjeevi) కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి వచ్చింది.

Megastar Chiranjeevi Suffering with..

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చిరంజీవికి చోటు దక్కడంతో తాజాగా హైదరాబాద్‌లో ఒక ఈవెంట్‌ జరిగింది. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చికున్ గున్యాతో బాధపడుతున్నప్పటికీ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి వచ్చింది. చికున్‌ గున్యా వల్ల వచ్చిన నొప్పులతోనే ఈ ప్రోగ్రామ్‌లో చిరంజీవి పాల్గొన్నారు. దీనితో ఆయన సాయి దుర్గాతేజ్ సహాయంతో స్టేజ్ పైకి వెళ్ళాల్సి వచ్చింది. అంతేకాదు స్టేజీపై మాట్లాడేటప్పుడు కూడా ఈ చికున్ గున్యా అనారోగ్యం దృష్ట్యా పలుమార్లు చిరంజీవి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, చిరంజీవి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో హాజరుకావడంతో అనేక ఇబ్బందుల నడుమ మెగాస్టార్ ఈ కార్యక్రమానికి హాజరై అభిమానులకు అలరించినప్పటికీ… ఆయన అనారోగ్యం గురించి తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also Read : Saree: ఆర్జీవీ ‘శారీ’నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ !

ChikungunyaMega FamilyMegastar Chiranjeevi
Comments (0)
Add Comment