Megastar Chiranjeevi: సతీమణి సురేఖకు మెగాస్టార్ స్పెషల్ బర్త్ డే విషెస్ ! 

సతీమణి సురేఖకు మెగాస్టార్ స్పెషల్ బర్త్ డే విషెస్ ! 

Megastar Chiranjeevi: కోట్లాది మంది అభిమానులకు మెగాస్టార్ అంటే చిరంజీవి. అయితే మెగా ఫ్యామిలీకు మాత్రం మెగాస్టార్ అంటే చిరంజీవి భార్య సురేఖ. ఎందుకంటే సినిమా రంగంలో ప్రవేశించిన అతి కొద్ది రోజులకే చిరంజీవి పెళ్లి చేసుకుని… ఎప్పుడూ షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో… కుటుంబ బాధ్యతలన్నీ సురేఖ చూసుకునేది. అందుకే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతీ ఒక్క హీరోకు కూడా సురేఖ అంటే అమితమైన గౌరవం, అభిమానం, ప్రేమ. ఇక మెగాస్టార్ చిరంజీవికి(Megastar Chiranjeevi) అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇటీవలే దేశ రెండో అత్యున్నత పౌర పురష్కారం పద్మవిభూషణ్ కు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి… తన భార్య సురేఖతో కలిసి వెకేషన్ కు అమెరికా వెళ్తున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. ప్రస్తుతం అమెరికాలో విహార యాత్రలతో పాటు.. సన్నిహితులకు చెందిన ఫంక్షన్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఆదివారం సురేఖ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతోంది.

Megastar Chiranjeevi Wishes Viral

తన సతీమణి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఆమెపై తనకున్న ప్రేమను కవిత రూపంలో వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఆమె పుట్టినరోజుని పురస్కరించుకుని… ‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ. హ్యపీ బర్త్‌డే’’ అంటూ స్పెషల్‌ గా విష్‌ చేశారు. ఈ మేరకు ఆమెతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీనితో చిరు రాసిన కవితకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు… ఆయన షేర్‌ చేసిన పిక్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు సురేఖకు విషెస్‌ చెబుతున్నారు. మరోవైపు, తన అత్తయ్య జన్మదినం సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్‌’ పేరిట ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించినట్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రకటించారు.

Also Read : Varun Dhawan: తండ్రి కాబోతున్న బాలీవుడ్ హీరో హీరో వరుణ్ ధావన్ !

Megastar ChiranjeeviSurekha KonidelaUpasana Konidela
Comments (0)
Add Comment