Megastar Chiranjeevi: డ్రగ్స్ వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ వీడియో !

డ్రగ్స్ వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ వీడియో !

Megastar Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న వివాదం డ్రగ్స్ వినియోగం. ఎక్కడ ఏ పార్టీ జరిగినా… డ్రగ్స్ దొరికినా అందులో సినిమా ఫీల్డ్ కు సంబంధించిన ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు సినీ పరిశ్రమకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తన వంతు బాధ్యతగా డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకాలు మరియు కొనుగోలు వంటి అంశాలపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Megastar Chiranjeevi Comment

ఈ వీడియోలు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు యువత సహకరించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతారని, బాధితులను శిక్షించడం కన్నా రక్షించడమే ప్రధానంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పనిచేస్తుందని వివరించారు. డ్రగ్స్ రహిత తెలంగాణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : Ajith Kumar: ఖైదీ నంబర్‌ 63 గా అజిత్ న్యూ లుక్ అదుర్స్ !

Drugs CaseMegastar Chiranjeevi
Comments (0)
Add Comment